Astrology: మేష రాశిలో అంగారక యోగం ఏర్పడబోతోంది. అలాగే కుజుడు, రాహు గ్రహాలు కలవబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రెండు గ్రహాల సంయోగం అస్సలే మంచిది కాదు. దీని వల్ల పలు రాశుల వాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వాళ్లకు అయితే అశుభ ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మూడు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మూడు రాశుల వాళ్లు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. అంగారక యోగం వృషభ రాశి నుంచి పన్నెండవ గ్రహంలో ఏర్పడుతుంది. ఇది నష్టాలు, ఖర్చులను సూచిస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లక్షల్లో డబ్బులు ఖర్చు అవ్వడం, అనేక రకాల నష్టాలు రావడం జరుగుతుంది.
సింహ రాశి.. అంగారక యోగం సింహ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఏర్పుడుతుంది. దీని వల్ల నష్టాలతో పాటు విదేశీ ప్రయాణాలకు ఆటంకం కల్గుతుంది. కాబట్టి విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది.
తులా రాశి.. ఉన్నత విద్య, ప్రేమ వివాహ స్థలంగా భావించే ఐదవ గృహంలో అంగారక యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ప్రేమ విషయాల్లో వైఫల్యాలను ఎదుర్కుంటారు. అలాగే కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.