Horoscope: ఈరోజు అంటే జూన్ 26వ తేదీ ఆదివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు నేడు కచ్చితంగా శుభవార్త వింటారు. అయితే ఈ రాశులు ఏంటి, ఎలాంటి శుభవార్త వినబోతున్నారో మనం ఇప్పుడు చూద్దాం.
ముందుగా మిథున రాశి.. మిథున రాశి వాళ్లు ఈరోజు ఒక ముఖ్యమైన విషయంలో.. ఆశించిన దాని కంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.
అలాగే కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళఅలు ప్రారంభించిన కార్యక్రమాలు నలుగురికీ ఆదర్శ ప్రాయంగా ఉంటాయి. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.