Lord Ganapathi: వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Lord Ganapathi: హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయకుడిని మొదటి పూజ్యుడిగా భావిస్తారు.ఈ క్రమంలోనే మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినా లేదా మంచి పనులు చేస్తున్న ముందుగా వినాయకుడికి పూజ చేసి అనంతరం ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇలా వినాయకుడికి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు వుండవని అలాగే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో లేదా ఆఫీసులో వినాయకుడి విగ్రహాలను పెట్టుకోవడం మనం చూస్తుంటాము. అయితే ఇలా వినాయకుడి విగ్రహాలు పెట్టుకొనే వారు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

ఎవరైతే వారి ఇంట్లో ఆనందం సిరిసంపదలు కలగాలని భావించి వినాయకుడిని పెట్టుకుంటారో అలాంటివారు తెలుపు రంగు వినాయకుడి ఫోటో పెట్టుకోవడం ఎంతో మంచిది. ఎవరైతే స్వీయ అభివృద్ధి కోరుకుంటారో అలాంటి వారు ఎరుపురంగు వినాయకుడిని పెట్టుకోవడం మంచిది. ఇక ఇంటిలో పూజించుకోవడం కోసం నిలబడిన వినాయకుడిని కాకుండా కూర్చున్న వినాయకుడిని తెచ్చుకుని పూజించాలి. ఇకపోతే కూర్చున్న వినాయకుడి విగ్రహానికి తొండం ఎల్లవేళలా ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి.

Advertisement

ఇక ఏదైనా ఆఫీసులు లేదా పనిచేస్తున్న ప్రదేశాలలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకుంటే అలాంటి చోట నిలబడి ఉన్న వినాయకుడి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల మరింత ప్రోత్సాహం, శక్తి కలుగుతుంది. వినాయకుడి విగ్రహంతో పాటు వినాయకుడు పక్కన ఎలుక ఉండ్రాళ్ళు కలిగి ఉన్న వినాయకుడిని పూజించడం మంచిది. ఒక పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహం మాత్రమే ఉండాలి అంతకు మించి ఉండకూడదు. ఇలా వినాయకుడి విగ్రహాలను పెట్టుకునే వారు ఈ విషయాలను గుర్తు పెట్టుకొని వినాయకుడి విగ్రహాలను పూజించడం వల్ల అంతా శుభం కలుగుతుంది.

Advertisement