Big Boss Non Stop Telugu : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26వ తేదీ 17 మంది కంటెస్టెంట్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి వారం పూర్తిచేసుకుంది. ఇలా మొదటి వారం పూర్తికావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి ఎలిమినేషన్ కంటెస్టెంట్ గా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు.
ఇలా మొదటి వారం ఏడు మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉండగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిన ఈమె తన ఉద్దేశపూర్వకంగానే బయటకు పంపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడంతో ఈవారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇక ఈ నామినేషన్ లో భాగంగా కంటెస్టెంట్ లతో ఫోటోలతో కూడిన బాక్స్ లకు నచ్చనివారు వాళ్ల ఫోటోలపై డ్రాగన్ తో గుచ్చాలి.అయితే వారిని నామినేట్ చేయడానికి కారణం కూడా తెలియ చేయాలని బిగ్ బాస్ వివరించారు.
ఇక ఈ వారం నామినేషన్లను భాగంగా ఏకంగా పదకొండు మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు అఖిల్, అరియానా, హమీద, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలతో పాటు సరయు, అనిల్, మిత్ర, శివ, అషురెడ్డి, శ్రీరాపాకలు ఎమినేషన్ కు నామినేట్ అయ్యారు. అయితే గత వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న వారు రెండవ వారంలో కూడా నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.
Read Also : Bigg Boss Telugu OTT : ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఆమెనే.. అప్పుడే తేల్చేసిన ఫ్యాన్స్