Bigg Boss Telugu OTT : హీరోయిన్ గా బిందు మాధవి పలు సినిమాల్లో నటించి సక్సెస్ ను సొంతం. అయితే ఆమె హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలను సొంతం చేసుకోలేక పోయింది. తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. తమిళ బిగ్బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా బిందు మాధవి మంచి పేరు సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అయిన బిందు మాధవి కి బిబి తెలుగు లో అవకాశం దక్కింది.
పాత, కొత్త కంటెస్టెంట్స్ కు వారధి అన్నట్లుగా ఈమే కొనసాగుతోంది. ఈమెను ప్రేక్షకులు తెగ అభిమానిస్తున్నారు, అందుకు కారణాలు లేకపోలేదు. క్యూట్ గా నవ్వడం మాత్రమే కాకుండా తన అవసరం ఎంత మేరకు ఉందో అంత వరకు మాత్రమే స్పందిస్తూ.. ఆ సమయంలో తాను ఏం చేయాలో అది చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే బిందు మాధవికి సోషల్ మీడియా లో ఫ్యాన్ పేజీలు మొదలయ్యాయి.
అంతేకాక బిందు మాధవి ఈ సీజన్ విజేతగా అంటూ అభి అభిమానుల్లో చర్చలు మొదలు అయ్యింది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ కి లేడీ విజేత కాలేదు. కనుక మొదటి లేడీ విజేతగా బిందు మాధవి నిలుస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయినా కూడా ఈ షో ను భారీగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బిందు మాధవి ఈ సీజన్ విజేతగా నిలిచి సినిమా సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లను దక్కించుకునే అవకాశం ఉందంటూ నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు.
Read Also : Radhe Shyam Making Video : రాధేశ్యామ్ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..!