Radhe Shyam Making Video : రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..!

Radhe Shyam Making Video : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న కొత్త మూవీ రాధేశ్యామ్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ కొత్త మూవీ 1960 నాటి బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. హస్త సామాద్రికలను చూసే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.

వింటేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. రాధేశ్యామ్ మూవీ కోసం రెబల్ స్టార్ ప్రభాస్‌ డైహార్ట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam Making Video : Pan India Star Prabhas Pooja Hegde's Radhe Shyam Making Video
Radhe Shyam Making Video : Pan India Star Prabhas Pooja Hegde’s Radhe Shyam Making Video

కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీమ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇటలీలో 1970 నాటి నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ వస్తోంది. ఒక పీరియాడిక్ లవ్ స్టోరీతో రానుంది. ఈ మూవీకి సంబంధించి యూరప్‌లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌, మంచు ప్రాంతాలతో షూటింగ్‌ చేశారు. కరోనా కారణంగా యూరప్‌లో షూటింగ్‌ ఆగిపోయింది.

Advertisement

దాంతో ఇటలీ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఇండియాలో భారీ సెట్ వేశారు. సినిమాకు అయిన ఖర్చులో దాదాపు ఈ భారీ సెట్లపైనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భారీ సెట్లలోనే షిప్ షూటింగ్ కూడా చేశారు. సముద్రంలో ఉన్న ఫీలింగ్ కలిగేలా అద్భుతంగా సృష్టించారు.

ఇప్పుడీ ఈ రాధేశ్యామ్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాధేశ్యామ్ మూవీ మార్చి 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో భారీ అంచనాలను పెంచుతోంది. రాధేశ్యామ్ మేకింగ్ వీడియో ఇదే..

Read Also : Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కోసం షూటింగ్ కి డుమ్మా కొట్టి వచ్చిన తమిళ స్టార్ హీరో… కారణం అదేనా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel