Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Bigg Boss OTT Telugu : ఈ అమ్మడిలో మార్పు చూసి ప్రేక్షకులు షాక్‌..!

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్‌ నాన్ స్టాప్ ప్రేక్షకుల నుండి ఆదరణ సాధించడంలో విఫలం అయింది అనే టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ బిగ్ బాస్ కి వచ్చిన రెస్పాన

By Ramesh Babu

Published on: March 6, 2022 7:00 AM

Updated on: March 5, 2022 11:44 PM

biggboss-nonstop-tejaswi-madivada-change-viral

---Advertisement---

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్‌ నాన్ స్టాప్ ప్రేక్షకుల నుండి ఆదరణ సాధించడంలో విఫలం అయింది అనే టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ బిగ్ బాస్ కి వచ్చిన రెస్పాన్స్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కి రాకపోవడంతో నిర్వాహకులు సైతం ఒకింత అసంతృప్తితో ఉన్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయం లో బిగ్ బాస్‌ నాన్ స్టాప్ ఇంటి మొదటి కెప్టెన్ గా తేజస్వి మదివాడ (tejaswi madivada) ఎంపిక అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

గత సీజన్లో సందడి చేసిన తేజస్వి తన నోటి దురుసు కారణంగా అప్పట్లో వెంటనే ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే, ఈ సీజన్లో కూడా ఆమె ఖచ్చితంగా తన నోటి దురుసు ప్రవర్తన కారణంగా విమర్శలు ఎదుర్కొంటుంది అంటూ అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈసారి తన ప్రవర్తన లో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎంత అంటే ఇంటి సభ్యులు అంతా కలిసి ఏకగ్రీవంగా ఆమెను కెప్టెన్ గా ఎన్నుకునే అంత.

Advertisement
biggboss-nonstop-tejaswi-madivada-change-viral
biggboss-nonstop-tejaswi-madivada-change-viral

బిగ్ బాస్‌ నాన్ స్టాప్ ఇంటి మొదటి కెప్టెన్ గా ఎంపిక అయిన తేజస్వి మదివాడ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు ఎక్కువగా బ్యాడ్‌ కామెంట్స్ వస్తుంటాయి కానీ ఈ సారి మాత్రం ఆమెకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కచ్చితంగా ఈ సారి ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటుంది అనే నమ్మకాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో చాలా మార్పు కనిపిస్తోందని, కచ్చితంగా ఆమెను ప్రేక్షకులు ఈ సారి ఆదరిస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆమె నుండి మరింత మంచి కంటెంట్ వస్తుందని ఆశిస్తున్నారు.

Read Also : Bigg Boss Telugu OTT Live : లైవ్ స్ట్రీమింగ్ అసలు నిజమేనా? ఎంత మంది చూస్తున్నారు?

, , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.