Bigg Boss Non Stop : బిగ్‌ బాస్‌లో మిత్ర కంటిన్యూ… జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారుగా..?!

Bigg Boss Non Stop : బిగ్ బాస్ ప్రతి సీజన్లో కూడా ఎలిమినేషన్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. బిబి టీం మెంబెర్స్ కొన్ని ఈక్వేషన్స్ ని అనుసంధానం చేసి, ఆధారంగా తీసుకొని కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు తప్ప ప్రేక్షకులు వేస్తున్న ఓట్ల ఆధారంగా మాత్రం ఎలిమినేట్ చేయడం లేదంటూ ప్రతి సీజన్ సమయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ కి కూడా ఇలాంటి విమర్శలు తప్పడం లేదు.

ఈ సీజన్లో మిత్ర అనే కంటెస్టెంట్ ని ఎందుకు కొనసాగిస్తున్నారె అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో బిగ్బాస్ ఫాలోవర్స్ గగ్గోలు పెడుతున్నారు. ఆమె తనకు పారితోషికం అక్కర్లేదు… ఎక్కువ వారాల పాటు తనను షో లో కంటిన్యూ చేయాలి అంటూ ముందుగానే కండిషన్ పెట్టిందని అందుకు అనుగుణంగా ఇప్పుడు ఆమెను కంటిన్యూ చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Bigg Boss Telugu OTT : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఈమేనా?

Bigg Boss Non Stop _ Bigg Boss Mitraaw Sharma to be continued in House This Week, hamida elimination This Week
Bigg Boss Non Stop _ Bigg Boss Mitraaw Sharma to be continued in House This Week, hamida elimination This Week

ఇప్పటి వరకు ఆమె కంటే ఎంతో మంది మంచి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళి పోయారు. ఇక ఈ వారం క్యూట్ బ్యూటీ హమీద కూడా బయటకు వెళ్ళి పోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు మిత్ర హౌస్‌లోనే కొనసాగుతోంది. ఆమె కంటిన్యూ వెనక బిగ్ బాస్ నిర్వాహకులు పెద్ద కుట్రకు పాల్పడుతున్నారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు ఓట్లు రాకుండా ప్రేక్షకుల ఆదరణ లేకుండా కేవలం ఆర్థిక పరమైన అంశాల కారణంగా ఆమెను కంటిన్యూ చేస్తున్నారు అంటూ చాలామంది బలంగా నమ్ముతున్నారు.

Advertisement
Bigg Boss Non Stop _ Bigg Boss Mitraaw Sharma to be continued in House This Week, hamida elimination This Week
Bigg Boss Non Stop _ Bigg Boss Mitraaw Sharma to be continued in House This Week, hamida elimination This Week

ఈ విషయమై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు లేదా బిగ్ బాస్ నిర్వాహకులు సమాధానం ఇవ్వాల్సిందే అంటూ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. మిత్ర ను ఉంచి హమీదా ను బయటకు పంపించాలి అంటే అంత సీన్ ఆమెకు లేదని.. ఆమె కంటే ఎక్కువ ఓట్లు హమీదాకు వచ్చాయి అని అయినా కూడా హమీదాను ఎందుకు ఎలిమినేట్‌ చేశారంటూ బిగ్బాస్ ప్రేక్షకుల ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక రకమైన భావనతో కలిగి ఉండటం వల్లే ఆమె బిగ్బాస్ హౌస్లో కొనసాగుతోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Acharya Flop : ‘ఆచార్య’ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.. ప్లాప్‌‌కు ఆ నాలుగు కారణాలు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel