...
Telugu NewsEntertainmentRadhe Shyam Box Office Collection Day 1 : 'రాధేశ్యామ్‌' మొదటి రోజు వసూళ్లు...

Radhe Shyam Box Office Collection Day 1 : ‘రాధేశ్యామ్‌’ మొదటి రోజు వసూళ్లు ఎన్ని కోట్లుంటే..?

Radhe Shyam Box Office Collection Day 1 : ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యాం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వసూళ్ల విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రోజే ఈ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేస్తోంది అంటూ కొందరు.. 70 కోట్లు వసూలు చేస్తుంది అంటూ మరి కొందరు ఊహాగానాలు వ్యక్తం చేశారు.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గా గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి అని అంతా అనుకున్నారు. అనూహ్యంగా సినిమా కథనం స్లో అంటూ ప్రచారం జరగడం తో వసూళ్లు తగ్గాయి అనడంలో సందేహం లేదు. ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు గ్రాస్‌ వసూళ్లు రూ. 55 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 37 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.|

Advertisement

Read Also : Radheshyam : ‘రాధేశ్యామ్‌’ ఫ్యాన్స్ అండ్‌ పబ్లిక్ టాక్‌

Advertisement

ఓవర్సీస్ లో ఈ సినిమా ఏకంగా 6.5 కోట్ల వసూళ్ల ను రాబట్టి నటిగా ట్రేడ్ వర్గాల సమాచారం అందుతోంది. భారీ హోప్స్ పెట్టుకున్న ఉత్తరాది నుండి మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టి లేకపోయింది అనే టాక్ వినిపిస్తోంది. అయితే హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమా ఉండడంతో కచ్చితంగా లాంగ్ రన్ లో అక్కడ భారీ వసూళ్లు రాబట్టిన అవకాశం ఉంది.

Advertisement
Radhe Shyam Box Office Collection Day 1
Radhe Shyam Box Office Collection Day 1

Radhe Shyam Box Office Collection Day 1 : ఏరియాల వారీగా ఈ సినిమా ఎంత వసూలు సాధించింది అనేది ఇక్కడ చూడండి..

నైజాం : 10.80 కోట్లు
సీడెడ్‌ : 3.70 కోట్ల
ఉత్తరాంద్ర : 1.94 కోట్లు
ఈస్ట్‌ : 2.6 కోట్లు
వెస్ట్‌ : 2 కోట్లు
గుంటురు : 2.6 కోట్లు
కృష్ణ : 95 లక్షలు
నెల్లూరు : 1.08 కోట్లు
రెస్ట్‌ ఆఫ్ ఇండియా : 4 కోట్లు
ఓవర్సీస్‌ :  6.5 కోట్లు
మొత్తం : 36.17 కోట్ల షేర్‌.. 55 కోట్ల గ్రాస్‌

Advertisement

Read Also : Radhe Shyam Review : ‘రాధేశ్యామ్‌’ సినిమా రివ్యూ

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు