Karthika Deepam Apr 4th Today Episode : తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. సౌందర్య, ఆనంద్ రావ్ లు హిమ ను పెళ్లి గురించి అడగగా అప్పుడు హిమ, సౌర్య కనిపించే వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పాడంతో ఆనంద్ రావ్, సౌందర్య లు బాధపడుతూ ఉంటారు. అప్పడు సౌందర్య బాధ పడుతూ దేవుడా సౌర్య తొందరగా కనిపించేలా చేయమని దేవుడిని ప్రార్థిస్తు ఉంటుంది.
మరొకవైపు గుడికి వెళ్ళిన సౌర్య,హిమ ను తొందరగా కనిపించేలా చూడు అని దేవుడిని కోరుకుంటూ ఉంటుంది. హిమ నాకు కనిపిస్తే సంతోషం లేకుండా చేస్తాను అని అంటుంది. అప్పుడు సౌర్య గుడిలో కొబ్బరికాయ కొడుతూ ఉండగా కొబ్బరికాయ ముక్క వెళ్లి స్వప్న తనకు తగులుతుంది. అప్పుడు స్వప్న సౌర్య తో గొడవ పెట్టుకుంటుంది.
ఇంతలో ప్రేమ కూడా గుడికి రాగా, ప్రేమతో కూడా గొడవ పెట్టుకుంటుంది సౌర్య. ప్రేమ్ ని సౌర్య ఎక్స్ట్రా అని అనడంతో అక్కడికి వచ్చిన స్వప్న సౌర్య చెంప చెల్లు మనిపిస్తుంది. అప్పుడు సౌర్య నువ్వు మా సత్యం సార్ పెళ్ళానివి అని వదిలేస్తున్నా అని అనడంతో, మా ఆయన కూడా నీకు తెలుసా అని అంటుంది స్వప్న.
స్వప్న సౌర్యని అలగా జనాలు అని తిడుతూ ఉండడంతో, కోపంతో చౌర్య స్వప్న కొట్టడానికి చేయి లేపుతుంది. అప్పుడు నిరూపమ్ వచ్చి సౌర్యని అడ్డుకుంటాడు. అప్పుడు స్వప్న,నిరూపమ్ ఫై కోప్పడుతూ నేను గుడికి రమ్మంటే రావు కానీ దీనితో వస్తావా అంటూ హిమ ఫై మండిపడుతుంది స్వప్న. దీనితో హిమ చాలా బాధ పడుతూ ఉంటుంది.
అది చూసిన ప్రేమ్, హిమ,నిరూపమ్ మధ్యలో ఏమైనా ఉందా అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు హిమ గుడిలో జరిగిన విషయాన్ని సౌందర్య ఆనంద్ రావు లకు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత స్వప్న కోపంతో సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్లి హిమ ను తిడుతూ నీ మొహం చూస్తే నాకు నా తమ్ముడు గుర్తుకు వస్తున్నాడు.
నాకు కేవలం నాన్న మాత్రమే ఉన్నాడు మమ్మీ లేదు అని ఆనందరావుకి చెబుతుంది స్వప్న. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.