Karthika Deepam Promo : కార్తీకదీపం.. కొత్త ట్విస్ట్.. ఒక్క ఎపిసోడ్‌తో డాక్టర్ బాబు, దీప క్యారెక్టర్లకు ఎండ్ కార్డ్ పడింది. ఇకపై కార్తీక దీపం కొత్త స్టోరీతో అలరించనుంది. ఇప్పటివరకూ చిన్నపిల్లలుగా కనిపించిన రౌడీ శౌర్య, హిమలు పెద్దకానున్నారు. డాక్టర్ చదివినట్టుగా హిమ కనిపిస్తే.. ఆటో డ్రైవర్‌గా శౌర్య కనిపించింది. కార్తీక దీపం ప్రోమోలో ఇదే చూపించారు. అంటే.. కార్తీక్, దీపల మరణానికి హిమనే కారణమని శౌర్య కోపంతో రగలిపోతుంటుంది. శౌర్య తాను పెద్దాయక కూడా హిమపై కోపంతో రగిలిపోతూనే ఉంటుంది.
సౌందర్య, ఆనందరావు ఇంట్లో హిమ రాయల్ లైఫ్ అనుభవిస్తుంటే.. రౌడీ సౌర్య మాత్రం ఆటో డ్రైవర్‌గా అనాథల మారిపోయింది. స్టార్ మా కార్తీకదీపం ప్రోమోలో సౌర్య, హిమలు పెద్దయ్యాక ఏమయ్యారో చూపించారు. అసలు హిమ సౌందర్య వాళ్ల ఇంటికి ఎలా వచ్చింది? సౌర్య ఎక్కడికి వెళ్లింది ఇదంతా సస్పెన్స్.. ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన హిమ ప్రత్యక్షం కావడం.. నేరుగా సౌందర్య ఇంటికి రావడం.. అదే సమయంలో శౌర్య హిమను చూడటం ఇష్టం లేదని అనడం.. ఆ బాధలో హిమ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అన్ని జరిగిపోయాయి. అయితే కార్తీకదీపం ప్రోమోలో కొత్త ట్విస్ట్ చూపించారు.
Karthika Deepam Promo : కార్తీకదీపం పిల్లలు పెద్దోళ్లయ్యారు…
కార్తీకదీపం లేటెస్ట్‌లో ప్రోమోలో.. సౌందర్య హిమను తీసుకుని ఇంటికి వెళ్తుంది. హిమ మాత్రం ఇంట్లోకి అడుగుపెట్టేందుకు భయపడుతుంది. సౌందర్య భయపడుతూనే ఇంట్లోకి వెళ్తుంది. సౌర్య డాక్టర్ బాబు, దీపల ఫొటో దగ్గర కూర్చొని ఏడుస్తు ఉంటుంది. శ్రావ్య, ఆదిత్య, ఆనందరావులు శౌర్యను ఓదార్చే ప్రయత్నం చేస్తుంటారు. హిమ, సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టగానే వీరంతా తిరిగి చూడటం ప్రోమోలో చూపించారు. హిమను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.
శౌర్య మాత్రం హిమను చూడగానే ఆగ్రహంతో చూస్తూ ఉండిపోతుంది. ప్రోమోలో శౌర్య, హిమల సీన్ హైలెట్ అని చెప్పాలి. హిమను చూసి.. కోపంగా శౌర్య.. ఆగు.. ఎందుకు వచ్చావ్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇంతంటితో ప్రోమో ఎండ్ అవుతుంది. కట్ చేస్తే.. చివరిలో ఆటో డ్రైవర్ గా శౌర్య.. డాక్టర్ గా హిమ పెద్దవాళ్లుగా కనిపిస్తారు. మొత్తానికి కార్తీకదీపం పిల్లలు పెద్దోళ్లయ్యారు.. ఇకనుంచి కార్తీక దీపం సీరియల్ కొత్త హీరోయిన్లతో మరింత రసవత్తరంగా ఉండనుంది.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Karthika Deepam: ఇంటికి చేరుకున్న హిమ.. ఇంట్లోకి రావద్దు అంటున్న సౌర్య..?