Karthika Deepam: కార్తీకు గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో వంటలక్క..మోనితతో ఛాలెంజ్ చేసిన దీప..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప, కార్తీక్ మెడికల్ రిపోర్ట్స్ ని తీసుకుని వెళుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ తలనొప్పి రావడంతో అలా వచ్చి గార్డెన్ లో కూర్చోగా ఇంతలోనే అక్కడికి దీప కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు కార్తీక్ రాత్రి నువ్వు వచ్చినావు కదా మళ్లీ ఎప్పుడు వెళ్ళిపోయావు అని అడగగా నేను మాట్లాడుతుంటే మీరు నిద్రపోయారు డాక్టర్ బాబు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే శివ అక్కడికి వచ్చి మేడం వస్తున్నారు నువ్వు వెళ్లి పక్క అని అంటాడు.

Advertisement

అప్పుడు దీప కాఫీ ఇచ్చి వెళ్తాను అని కాపీ ఇస్తుండగా ఇంతలోనే ఆ కాపీ కప్పును మోనిత విసిరి కొడుతుంది. ఇప్పుడు కార్తీక్ చేతులు ఆనంద్ ని చూసి దీప షాక్ అవుతుంది. అప్పుడు వెంటనే కార్తీక్ ఈ బాబు ఎవరు అని అడగగా మన బాబు వీడిని తేవడానికి వెళ్తానని చెప్పాను కదా అప్పుడే మరిచిపోయావా అని అంటుంది. అప్పుడు బాబు ఏడుస్తూ ఉండగా వెంటనే దీప, డాక్టర్ బాబు మీరు బాబుని ఎత్తుకోండి ఏడుపు ఆపేస్తాడు అని అంటుంది.

అప్పుడు దీపా చెప్పిన విధంగా కార్తీక్ ఎత్తుకోగానే బాబు ఏడుపు ఆపడంతో అవును ఇది నీకు ఎలా తెలుసు అని అనగా ఒకసారి గతం గుర్తు తెచ్చుకోండి అని అనడంతో వెంటనే కార్తీక్ ఆలోచనలో పడతాడు. దీంతో టెన్షన్ పడిన మోనిత, కార్తీక్ ని అక్కడ నుంచి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత దీప జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వాళ్ళ డాక్టర్ అన్నయ్య వస్తాడు.

అప్పుడు దీప కార్తీక్ మెడికల్ రిపోర్ట్స్ ని చూపిస్తుంది. దీంతో వెంటనే అతను ఇవి మంచి స్పెషలిస్ట్ కి చూపించి అందుకు తగ్గ ట్రీట్మెంట్ చేపిద్దాము అని అంటాడు. అప్పుడు దీపా ఎమోషనల్ అవుతూ మోనిత చేస్తున్న కుట్రలు అన్ని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత దీప ఆలోచిస్తూ వంట చేస్తూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా చేయి తెగుతుంది.

Advertisement

అంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి అంత పరధ్యానంతో ఉంటే ఎలా వంటలక్క ఏమైనా అయితే అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఉదయం కాఫీ తెస్తే మోనిత కింద పడేసింది కదా అందుకే స్వారీ చెబుదామని వచ్చాను అనడంతో దీప మళ్లీ వెళ్లి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు దీప, కార్తీక్ ని మాటల్లో పెట్టి కార్తీక్ గతం గుర్తుకొచ్చే విధంగా మొత్తం గతమంతా వివరిస్తుంది.

అప్పుడు కార్తీక్ తన గతాన్ని మొత్తం ఊహించుకుంటూ ఉంటాడు. మరోవైపు మోనిత శివ దగ్గరికి వచ్చి కార్తీక్ ఎక్కడ ఉన్నాడు అని అనగా వంట లెక్క దగ్గరికి వెళ్ళాడు అని చెప్పడంతో అక్కడికి టెన్షన్ గా వెళ్తుంది. మరోవైపు గతం గురించి ఆలోచించి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు దీప ఏం జరిగిందా అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే మోనిత అక్కడికి వచ్చి ముఖంపై నీళ్లు చల్లి అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తుంది.

అప్పుడు దీప డాక్టర్ బాబుకి గతం గుర్తుకు వచ్చినట్టుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు అని అనుకుంటుంది. ఆ తర్వాత మోనిత,దీప ని ఎలా అయినా వదిలించుకోవాలి ఇక్కడే ఉందంటే కచ్చితంగా గతం గుర్తుకు వచ్చేలా చేస్తుంది ఏదైనా ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మోనిత , దీప ఇంటి దగ్గరికి వెళ్లి గతం గుర్తుకు రాకుండా చేస్తాను అని అనగా వెంటనే దీప గట్టిగా సమాధానం చెబుతూ చనిపోయాను అనుకున్నా నేనే తిరిగి వచ్చాను అలాంటిది గతం గుర్తుకు రాదా, ఆనంద్ జ్ఞాపకాలు గుర్తుకొస్తే తప్పకుండా నేను కూడా గుర్తుకు వస్తాను అని అంటుంది.

Advertisement

అప్పుడు వెంటనే మోనిత రాకుండా చేస్తాను అని అంటుంది. ఇప్పుడు దీప కూడా ఏమాత్రం తగ్గకుండా నేను గతం గుర్తుకు వచ్చే విధంగా చేస్తాను అని అంటుంది. ఇంతలోనే డాక్టర్ బాబు అని పిలవడంతో కార్తీక్ లోపల నుంచి బాబుని ఎత్తుకొని వస్తాడు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel