Karthika Deepam March 12th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది.ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. కార్తీక్,దీప ల ఫోటోలను చూసి సౌందర్య కుటుంబ సభ్యులు భోరున ఏడుస్తూ ఉంటారు. అప్పుడు సౌందర్య కూతురు, అల్లుడు ఎంట్రీ ఇస్తారు.ఆ తరువాత విధవరాలి గా ఎంట్రీ ఇచ్చిన మోనిత నా కార్తీక్ ని మీరే చంపేశారు అని అంటుంది. ఏ రోజు కూడా మా కార్తీక్ ని మీరు సంతోషంగా ఉంచలేదు అని అనగా అప్పుడు ఆదిత్య కొప్పడగా,సౌందర్య సైలెంట్ గా ఉండమని చెబుతుంది.
కానీ మొనిత మాత్రం పుండు మీద కారం చల్లినట్టు వారి బాధలో వారు ఉంటే కార్తీక్ చావుకు కారణం మీరే అన్నట్టుగా వాగుతూ ఉంటుంది. మరొకవైపు సౌర్య,హిమ ఫోటోలను, పుస్తకాలను, బట్టలను విసిరీ కొడుతుంది. అప్పుడు సౌందర్య ఎందుకు సౌర్య అలా చేస్తున్నావు అని అనగా అది అమ్మానాన్న ను చంపేసింది అని అంటుంది సౌర్య.
అది మొండిగా ప్రవర్తించడం వల్లే అమ్మానాన్నలు నాకు లేకుండా పోయారు అని కోప్పడుతుంది సౌర్య. అది డ్రైవింగ్ చేయకపోయి ఉంటే ఈ రోజు అమ్మ నాన్న బతికేవాళ్ళు అని అంటుంది సౌర్య. మరొకవైపు కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ హిమ ను ఒక భార్య భర్తలు రక్షిస్తారు. హిమ జరిగిన విషయం గురించి తలుచుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది.
అప్పుడు దీప తనతో మాట్లాడిన మాటలు అన్నీ గుర్తుతెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని అంటుండగా అంతలో ఆ దంపతులు వచ్చి అమ్మ మంచినీళ్లు తాగు అని తాగడానికి ఇవ్వగా హిమ ఆ మంచి నీళ్ల గ్లాసును విసిరి కొడుతుంది. అప్పుడు ఆ దంపతులు హిమ కు జరిగినదంతా వివరిస్తారు.
ఆ దంపతులు ఎంత చెప్పినా వినకుండా జరిగిన ఈ విషయం గురించి, ఆ యాక్సిడెంట్ గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. నేను మా నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తాను అంటూ బయలుదేరుతుంది హిమ. హిమ ను చూసి ఆ దంపతులు ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ సౌందర్య ఇంటికి వెళ్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam : ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దీప, కార్తీక్, హిమ.. గుండెలవిసేలా రోదిస్తున్న సౌందర్య..?