Karthika Deepam: బుల్లితెరపై విశేషమైన ప్రేక్షకాదరణ పొంది అత్యధిక రేటింగ్స్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బుల్లితెర పై ఎలాంటి కార్యక్రమాలు ప్రసారమైనప్పటి ఇప్పటివరకు ఏ కార్యక్రమం కూడా ఈ సీరియల్ రేటింగ్ ను బీట్ చేయలేదని చెప్పాలి.అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీరియల్ కథలో కీలక మలుపు తిరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ సీరియల్ కథ సాగదీయడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సీరియల్ పై మరింత ఆసక్తి నెలకొల్పడం కోసం కథలో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఒక రోడ్డు ప్రమాదంలో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను చంపేసినట్లు చూపించారు. ఈ విధంగా ఈ సీరియల్ కి వంటలక్క డాక్టర్ బాబు పూర్తిగా గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న పరిటాల నిరుపమ్ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా డాక్టర్ బాబు స్పందిస్తూ మీరు ఎంత బాధ పడుతున్నారో… మేము కూడా అంతే బాధపడుతున్నాము. ఇదే చివరి ఫోటో అంటూ కార్తీక దీపం సెట్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..ఇన్ని రోజులు తమపై ఎంతో ప్రేమాభిమానాలు చూపినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలా డాక్టర్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేయడంతో ఇక ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వీరిద్దరి వల్ల ఈ సీరియల్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అలాంటిది ఈ సీరియల్ నుంచి వంటలక్క,డాక్టర్ బాబు వెళ్లిపోవడంతో ఈ సీరియల్ ఏ విధంగా మలుపు తిరగబోతోందనే అంశం పై ఆసక్తి నెలకొంది.