...

Karthika Deepam : ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దీప, కార్తీక్, హిమ.. గుండెలవిసేలా రోదిస్తున్న సౌందర్య..?

Karthika Deepam March 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..దీప ఎంత వద్దన్నా వినకుండా హిమ కార్ డ్రైవింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే కారు స్టార్ట్ చేస్తుంది. కారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత హిమ కారు ని హ్యాండిల్ చేయలేకపోతుంది. దీనితో దీప గట్టిగా డాక్టర్ బాబు అని పిలవగా, పార్టీ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక కారుని కార్తీక్ అదుపుచేసే లోపే అదుపుతప్పిన కారు లోయలోకి పడిపోతుంది.

లోయలోని ఆ కార్ బ్లాస్ట్ అవుతుంది. దీంతో కార్తీక్, దీప,హిమ చనిపోతారు. అదంతా చూసిన సౌర్య ఏడుస్తూ కళ్ళు తిరిగి స్పృహ తప్ప పడిపోతుంది. ఇక ఈ వార్త తెలుసుకున్న సౌందర్య గుండెలవిసేలా రోదిస్తుఉంటుంది. కార్తీక్, దీప లు చనిపోయిన వార్తను లక్ష్మణ్ ద్వారా తెలుసుకున్న మోనిత ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి టీవీ ఆన్ చేసి చూస్తుంది.

Karthika Deepam March 11 Today Episode
Karthika Deepam March 11 Today Episode

ఇక టీవీలో న్యూస్ విన్న మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు సౌందర్య కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉండగా దీప, కార్తీక్ ల మరణవార్త తెలుసుకున్న బస్తీవాసులు సౌందర్య ఇంటికి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి ఏడుస్తూ ఉంటారు. ఇక కార్తీక్, దీప ల ఫోటోలకి కుటుంబమంతా దండ వేసి బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇక ఇంతలో అక్కడికి కార్తీక్ వాళ్ళ అక్క వచ్చి మీ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏంటి అంటూ బోరున ఏడుస్తుంది. ఇంతలో మోనిత అక్కడకు విధవరాలిగా తెల్ల చీర కట్టుకొని వస్తుంది. కార్తీక్ అయిపోవడానికి సౌందర్య కుటుంబమే కారణం అంటూ ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ మీరు అన్యాయం చేశారు అంటూ సౌందర్య కుటుంబాన్ని నిలదీస్తూ ఉంటుంది.

ఆ తర్వాత అనుకోకుండా సౌందర్య ఇంటికి హిమ వస్తుంది. మరోవైపు సౌర్య, హిమ మీద కోపంతో ఫోటోని విసిరేస్తుంది. అంతేకాకుండా సినిమా బట్టలు బయటికి విసిరేసి అమ్మానాన్నలను మింగేసిన రాక్షసి అంటూ ఏడుస్తుంది. అది విన్న హిమ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam: హిమ చేసిన పనికి.. ప్రమాదంలో పడిన సౌందర్య కుటుంబం..?