Shanmukh Jaswanth : దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వీళ్ళిద్దరూ చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్నో సిరీస్ లు,డాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్లు లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చారు. దీంతో వీరిద్దరు వ్యక్తిగతంగా కంటే జోడిగానే ఎక్కువ పాపులారిటీనీ సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే దీప్తి,షన్ను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో బిగ్ బాస్ ఐదో సీజన్లోకి షణ్ముఖ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో సిరి తో కలిసి ఆడడం, కలిసి తినడం,హాగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడు ఓడిపోవడంతో పాటు ప్రేమలో చిక్కులు వచ్చాయి.ఈ నేపథ్యంలో దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ కి న్యూ ఇయర్ రోజు బ్రేకప్ చెప్పింది.
దీంతో షన్ను కూడా దీప్తి నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉందని, ఆల్ ది బెస్ట్ దీపు నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో వీళ్ల బంధం ముగిసిపోయిందని ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు.ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ తండ్రి దీని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆ అమ్మాయికి ఫీలింగ్ అనిపించిందేమో కానీ ఇప్పుడయితే ఇద్దరూ కలిసే ఉంటారు. ఇందులో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదని, కానీ కలిసేందుకు కొద్దిగా టైం పడుతుందంటూ సంచలన నిజాన్ని బయటపెట్టారు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తారని అంతా అనుకుంటున్నారు.
Read Also : Shanmukh jaswanth : ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్న షణ్ముఖ్ జస్వంత్, ధర ఎంతంటే?