Telugu NewsEntertainmentRRR Movie BBB : RRR సినిమా లాగా BBB సినిమా కూడా రాబోతుందా.?

RRR Movie BBB : RRR సినిమా లాగా BBB సినిమా కూడా రాబోతుందా.?

RRR Movie BBB : RRR మూడు ఆర్ లు కలిస్తే పాన్ ఇండియా మూవీ రౌద్రం, రణం,రుదిరం. ఇప్పుడు అలాగే మూడు B లు కలుస్తున్నాయి. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు కలిసినట్టే, బాలయ్య, బోయపాటి,బన్నీ కాంబినేషన్ సెన్సేషన్ కాబోతుందట. అందుకు కథ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి అటెన్షన్ లాక్కుంటున్న మల్టీస్టారర్ మూవీ RRR. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి సినిమానే మరొకటి ప్లాన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ మొత్తం ప్రచారం జరుగుతోంది. అఖండ సక్సెస్ వల్లే ఆ గుసగుసలు పెరుగుతున్నాయి.

Advertisement

అఖండ హిట్ తో బోయపాటి శ్రీను మరోసారి తన సత్తా చాటాడు. బాలయ్య తో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో పుష్పాతో పాన్ ఇండియా లెవెల్ లో బన్నీ బాక్సాఫీస్ ని కుదిపేసాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందనే బోయపాటి ఆలోచన.. ఆచరణలో పెట్టేలా ఉన్నాడు. RRR లో R ఫర్ రాజమౌళి,R ఫర్ రామ్ చరణ్, R ఫర్ రామారావు.

Advertisement

ఇలాగే ఇప్పుడు B ఫర్ బోయపాటి, B ఫర్ బాలయ్య బాబు, B ఫర్ బన్నీ అంటూ త్రిబుల్ బి ఫార్ములా సాధ్యం కాబోతుందట.ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్టు మీద చర్చలు జరుగుతున్నాయట. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీస్టారర్లే. ఆల్రెడీ నాగచైతన్యతో కలిసి నాగార్జున చేసిన బంగార్రాజు మూవీ సందడి షురూ అయింది. ఇలాంటి సమయంలో మరిన్ని మల్టీస్టారర్ ల మీద గుసగుసలు పెరగడంతో టాలీవుడ్ లో ఇప్పుడు మళ్లీ పాత ట్రెండ్ షురూ అయిందంటున్నారు.

Advertisement

ఎన్టీఆర్ తో త్రిబుల్ ఆర్ చేసిన రామ్ చరణ్ అంతకుముందే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేశాడు. ఇది కూడా థియేటర్స్ మీద దండెత్తేందుకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్,దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. అర డజన్ కు పైనే మల్టీస్టారర్ లతో టాలీవుడ్ ఈ పాత ట్రెండ్ కి కొత్తగా రీసౌండ్ పెంచుతోంది. బాహుబలి లో మల్టీస్టారర్ ల జోరు పెంచిన రాజమౌళినే,ఇప్పుడు బాలయ్య,బోయపాటి,బన్నీ కాంబినేషన్ సెట్ అవడానికి కారణమట. త్రిబుల్ R లానే త్రిబుల్ B ఐడియా ఎలా ఉంటుందంటున్నారు. బన్నీతో బోయపాటి మూవీ కాగానే త్రిబుల్ B కూడా త్రిబుల్ R లా పట్టాలెక్కే అవకాశం ఉందట.

Advertisement

Read Also : మన భారతీయ నదుల గురించి ఆస్తకిరమైన వాస్తవాలు ఇవే..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు