Telugu NewsLatestDevatha Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : ఆదిత్య గురించి బాధపడుతున్న సత్య.. మాధవ మాటలకు...

Devatha Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : ఆదిత్య గురించి బాధపడుతున్న సత్య.. మాధవ మాటలకు భయపడిపోయిన జానకి..?

Devatha Serial Sept 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో చిన్మయి, జానకికి కథలు చెబుతూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో రాధ,జానకికి రాగిజావ తాగిస్తూ ఉంటుంది. అప్పుడు రామ్మూర్తి,రాధకు దండం పెట్టగా మీరు నాకు దండం పెట్టడం ఏంటి అని అనడంతో నువ్వు దేవతవి. మేము నీకోసం ఏం చేశామో తెలియదు కానీ నువ్వు మా కోసం ఇంత కష్టపడుతున్నావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము రాధ అని అంటాడు రామ్మూర్తి.

Advertisement
Devatha Serial Sept 30 Today Episode
Devatha Serial Sept 30 Today Episode

అప్పుడు రాధ అయ్యో ఇందులో రుణం ఏమున్నది మా అమ్మకి ఇలానే ఉంటే వదిలేస్తానా నేను నా బిడ్డలు అనాధలుగా ఎక్కడికి వెళ్లాలో తెలియనప్పుడు మీరు నాకు నీడనిచ్చిండ్రు అంటుంది రాధ. అప్పుడు రామ్మూర్తి నీకు ఏం కావాలో అడగమ్మా కానీ ఏమీ వద్దు అని మాత్రం చెప్పొద్దు అని అనడంతో నాకు అడగాలి అనిపించిన రోజు అడుగుతాను ఆరోజు చేయండి అని అంటుంది రాధ.

Advertisement

మరొకవైపు దేవినీ ఆదిత్య డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తుండగా అప్పుడు దేవి మా అవ్వకు నయం కావాలి ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు సారు అని అంటుండగా అప్పుడు ఆదిత్య ట్రీట్మెంట్ చేస్తే బాగవుతుంది అంటూ దేవికి ధైర్యం చెబుతాడు. మరొకవైపు చిన్మయికి, జానకి ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

ఇప్పుడు వెంటనే చిన్మయి నోట్ బుక్ తీసుకొని వచ్చి మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కదా నామ్మమ్మ ఇందులో రాయండి అని అంటుంది. అప్పుడు మాధవ తన బండారం బయటపడుతుందేమో అని ఎందుకు అమ్మని ఇబ్బంది పెడతారు అని అనగా వెంటనే చిన్మయి నానమ్మ ఏదో చెప్పాలి అనుకుంటుంది చెప్పనివ్వండి నాన్న అని అంటుంది.

Advertisement

Devatha Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : డాక్టర్ మాటలకు మాధవలో టెన్షన్.. 

కానీ జానకి మాత్రం రాయలేక పోతుంది. ఇంతలోనే దేవి ఆదిత్య కలిసి డాక్టర్ నీ పిలుచుకొని వస్తారు. అప్పుడు డాక్టర్ మెట్ల మీద నుంచి కింద పడటం వల్ల ఆ షాక్ లో ఇలా జరిగింది ట్రీట్మెంట్ ఒక వారం రోజులు చేస్తే మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది అని అంటాడు. దాంతో డాక్టర్ మాటలకు మాధవ టెన్షన్ పడుతూ ఉంటాడు.

Advertisement

ఇప్పుడు జానకిని పరిశీలించిన డాక్టర్ తననికి పూర్తిగా నయం చేసే బాధ్యత నాది అని చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. మరో వైపు సత్య ఒంటరిగా ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవుడమ్మ అక్కడికి వస్తుంది. అప్పుడు ఏం ఆలోచిస్తున్నావ్ సత్య అని అడగడంతో అప్పుడు సత్య ఆదిత్య ప్రవర్తనకి ఏం బాగోలేదు ఆంటీ అని మాట్లాడుతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు జానకి ఒంటరిగా ఉండగా ఇంతలోనే అక్కడికి మాధవ వస్తాడు. మాధవ రావడానికి చూసి జానకి టెన్షన్ పడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మాధవ అక్కడికి వచ్చి తన తల్లిని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటాడు. ఎవరూ లేని సమయం చూసి జానకికి మాధవ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. రాధా విషయంలో ఎవరు అడ్డొచ్చినా వాళ్లకు కూడా ఇదే గతి పడుతుంది అనటంతో జానకి భయపడుతూ ఉంటుంది.

Advertisement

Read Also : Devatha serial Sep 27 Today Episode : ఆదిత్యని తప్పుగా అర్థం చేసుకున్న సత్య..రాధకు అసలు విషయం చెప్పాలి అనుకుంటున్న జానకీ..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు