Devatha serial September 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో డాక్టర్ జానకమ్మకి పక్షవాతం వచ్చింది అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈరోజు ఎపిసోడ్ లో జానకమ్మ ఇంకా నడవలేదు మాట్లాడలేదు అనటంతో అందరూ షాక్ అవుతారు. ఆ మాటలు విన్న మాధవ మాత్రం సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉండగా ఆదిత్య ఓదారుస్తూ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ రాసిస్తాను క్రమం తప్పకుండా వాటిని వాడితే సరిపోతుంది.

ఈరోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకు వెళ్లొచ్చు అని అనగా ఆదిత్య దేవుడమ్మ బయటికి వెళ్తారు. మరొకవైపు రాధ జానకమ్మ పరిస్థితి తెలుసుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో సిస్టర్ వచ్చి రాదని పిలుస్తుంది. అప్పుడు జానకమ్మ ఎమోషనల్ అవుతూ రాధకు ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇంతలోనే అక్కడికి దేవుడమ్మ, రామ్మూర్తి వాళ్ళు అందరూ వస్తుండగా రాధ వెళ్లి చాటున దాక్కుంటుంది. అప్పుడు జానకమ్మ ని చూసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు దేవుడమ్మ, రాధా గురించి అడగడంతో వెంటనే చిన్మయి మా అమ్మ అందరికీ లంచ్ తీసుకుని రావడానికి ఇంటికి వెళ్ళింది నానమ్మ అని చెబుతుంది. అప్పుడు మాధవ ఆ పక్కనే ఉన్న రాదని గమనిస్తాడు.
అప్పుడు దేవుడమ్మ మాధవ రామ్మూర్తిలకు ధైర్యం చెబుతూ ఉండగా జానకి మాత్రం మాధవ వైపు చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మాధవ మా అమ్మని చూసుకోవడానికి నా భార్య రాధ ఉందిగా ఆడడంతో ఆదిత్య షాక్ అవుతాడు. రాధా మాత్రం కోపంతో రగిలిపోతూ ఉండగా జానకి ఎమోషనల్ అవుతుంది.
అప్పుడు జానకి దగ్గరికి వెళ్లిన మాధవ జానకి చెయ్యి పట్టుకుని రాధ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు సత్య ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఆదిత్యను తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే దేవుడమ్మ వాళ్ళు రావడంతో కావాలనే ఆదిత్యని వెటకారంగా మాట్లాడిస్తుంది సత్య.
Devatha serial Sep 27 Today Episode : జానకమ్మ ఆరోగ్యం గురించి రామ్ మూర్తి ఎమోషనల్..
అప్పుడు జానకమ్మ పరిస్థితి తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది సత్యం. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన జానకమ్మ ఒక చోట కూర్చుని జరిగిన విషయాలు తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రాధా అక్కడికి రావడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెబుతూ సైగలు చేస్తుంది జానకమ్మ. కానీ రాధా మాత్రం మిమ్మల్ని ఇటువంటి పరిస్థితులలో విడిచిపెట్టి వెళ్లిపోను ఎక్కడికి వెళ్ళను.
మీ అబ్బాయి సంగతి మీకు కూడా తెలిసింది కదా నాకేం భయం మీ అబ్బాయి సంగతి నేను చూసుకుంటాను మీరు ఏమి ఆలోచించొద్దు అని రాధా జానకమ్మకి ధైర్యం చెబుతుంది. మరొకవైపు మాధవ సంతోషంతో గిటార్ వాయిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాధ పిల్లలకు భోజనం తినిపిస్తూ ఉండగా అప్పుడు చిన్మయి దేవి ఏదో చిన్నమ్మ కోపంలో అలా ఆ మాటలు అనింది అని నువ్వు అందరితో మాట్లాడకుండా ఉండటం కరెక్ట్ కాదు అనటంతో ఆ మాటలు విన్న రాదా చిన్మయి వైపు ఎమోషనల్ గా చూస్తూ ఉంటుంది.
Read Also : Devatha: హాస్పిటల్లో జానకమ్మ.. మాధవ పై కోప్పడిన రామ్మూర్తి..?