Guppedantha Manasu March 18th Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మహేంద్ర కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి లెటర్ ను రిషి చేతిలో పెట్టి వెళ్ళి పోతూ ఉంటాడు. వెనకాలే రిషి డాడ్ ఆగండి.. ఆగండి అని అంటున్నా కూడా మహేంద్ర రిషి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక మహేంద్ర వెళ్లిపోయిన తర్వాత రిషి తాను తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా కానీ డాడ్ ఇలా ఎందుకు చేశాడు అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలోనే రిషి కి ఒక లెటర్ వస్తుంది. జగతి పంపిన లెటర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ను ముందుకు తీసుకెళ్లాలి అను కోరుతున్నట్లు జగతి రాసుకొచ్చింది. ఆ రెండు లేఖలు చూసిన రిషి ఒకరిది బ్లాక్ మెయిల్, మరొకరిది ఎమోషనల్ అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రిషి తన మహేంద్ర కు ఫోన్ చేయగా మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు.

మళ్ళీ వెంటనే చేయగా ఫోన్ లిఫ్ట్ చేసి మహేంద్ర నేను బాధతో తీసుకున్న నిర్ణయం అది అని చెబుతాడు. మరి పెదనాన్న కు ఏం చెబుతారు అని రిషి ప్రశ్నించగా.. అప్పుడు మహేంద్ర ఆయనకు నా మనసులోని బాధను చెబుతాను. అయినా నా నిర్ణయాన్ని గౌరవిస్తారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడికి వసు వస్తుంది.
Guppedantha Manasu March 18th Today Episode : జగతిపై విరుచుకుపడ్డ రిషి.. ఆగ్రహంతో ఊగిపోతూ..
ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అని రిషి వసు ని అంటాడు. అప్పుడు వసు ఏమైంది సార్ అని ప్రశ్నించగా.. లెటర్ చేతికి ఇచ్చి చదువు అని చెబుతాడు. ఆ లెటర్ లు చదివిన వసు షాక్ అవుతుంది. ఇక అక్కడి నుంచి వసుధార ని తీసుకొని జగతి ఇంటికి వెళ్తాడు రిషి. మహేంద్ర చేసిన పనికి జగతీని నిందిస్తాడు. జగతి నా తప్పు లేదు సార్ అని చెబుతున్నా వినకుండా.. నాకంటూ ఉన్నది మా డాడి ఒక్కరే తనను కూడా దూరం చేయొద్దు అంటూ జగతికి చేతులెత్తి మొక్కుతారు రిషి. అప్పుడు మనసులో జగతి ఎందుకు మహేంద్ర వద్దన్నా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు అని అనుకుంటూ ఉంటుంది.
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినందుకు రివెంజ్ తీర్చుకున్నారు కదా మేడం అని అంటాడు రిషి. రిషి మాటలకు జగతి మరింత కుమిలిపోతూ ఉంటుంది. ఎలా అయినా డాడ్ ని ఒప్పించి ఆ రాజీనామా లెటర్ ను వెనక్కి తీసుకునేలా చేయండి మేడం అని జగతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
రిషి వెళ్లిన తర్వాత వసు, జగతి జరిగిన విషయం గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. మరొకవైపు మహేంద్ర, గౌతమ్ ఇంట్లో కూర్చొని క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడు గౌతం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాడు మహేంద్ర. ఇంతలో జగతి ఫోన్ చేసి ఇంటి బయట ఉన్నాను రమ్మని చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: మహేంద్ర చేసిన పనికి షాక్ అయిన రిషి.. ధరణి పై విరుచుకు పడుతున్న దేవయాని..?