Guppedantha Manasu Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మహేంద్ర, గౌతమ్ తో కలిసి క్యారమ్స్ ఆడుతుండగా ఇంతలో జగదీష్ ఫోన్ చేసి మహేంద్ర కలవాలి మీ ఇంటి బయట ఉన్నాను అని చెప్పగానే మహేంద్ర వెళ్తాడు. అధికారులు కలిసి ఇద్దరూ మాట్లాడుకోవడానికి బయలుదేరుతారు. ఇక ఇద్దరే చూసిన జగతి కాలేజీలో ఆ సంఘటన జరిగిన తర్వాత వీరిద్దరూ మరింత రెచ్చిపోతున్నారు ఏదో ఒక ప్లాన్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
జగతి మహేంద్ర చేసిన పనికి కోప్పడుతూ ఎందుకు పదేపదే రిషి నీ బాధ పెట్టె పనులు చేస్తున్నావ్ అని అడుగుతుంది. నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేశావ్ మహేంద్ర, రాజీనామా తరువాత పై పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మరిచిపోయావా అని నిలదీస్తుంది. అప్పుడు మహేంద్ర నీకు రిషి నే జీవితం,కానీ రిషి జీవితంలో నువ్వు లేవు లేవు అని అంటాడు మహేంద్ర.
అయినా కూడా జగతి నువ్వు రాజీనామా ఎందుకు చేసావు కారణం చెప్పు అని అడుగుతుంది. నువ్వు కాలేజీకి వెళ్లకపోతే రిషి ఒంటరివాడు అవుతాడు అప్పుడు రిషి మనసు చాలా బాధపడుతుంది అని జగతి అనగా, మరి నువ్వు ఒంటరి అయినప్పుడు ఎవరు ఆలోచించారు అని ప్రశ్నిస్తాడు మహేంద్ర.

అప్పుడు మహేంద్ర మాట్లాడుతూ నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా మనసు మారదు నా నిర్ణయం ఇంతే అని కరాఖండిగా చెప్పేసింది వెళ్ళిపోతాడు మహేంద్ర. అంతేకాకుండా నా నిర్ణయాన్నీ అన్నయ్య కూడా చెప్పాను అన్నయ్య కూడా నా మాటకి విలువ ఇచ్చి నాకు తోచిన విధంగా చేయమని చెప్పారు అని అంటాడు మహేంద్ర.
అప్పుడు జగతి కోపంతో నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంటూ కసురుకుంటుంది. మరొక వైపు దేవయాని రిషి రావడం చూసి దొంగ ఏడుపులు ఏడుస్తూ రిషి కి జగతి గురించి చాడీలు చెప్పి మరింత రెచ్చగొడుతుంది. దేవయాని మాటలు నిజం అని నమ్మిన రిషి జగతి పై మరింత కోపం పెంచుకుంటాడు.
మరొకవైపు గౌతమ్ ధరణి తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర వసు ని ఇంటికి పిలుచుకుని వస్తాడు.వసు ని చూసిన గౌతమ్ ఆనందంతో వెళ్లి పలకరిస్తాడు. వీరందరూ మాట్లాడుతుండగా ఇంతలో రిషి వస్తాడు. అప్పుడు రిషి ఎందుకు వచ్చావని వసు అని అడగ్గ మహేంద్ర సార్ ని అడగండి అని సమాధానమిస్తుంది వసు.
ఇక మహేంద్ర,వసు అందరూ కలసి రిషి కి చెప్పకుండా మాట్లాడుకుంటూ ఉండగా,ఇంతలో అక్కడికి వచ్చిన విషయం ఏం చేస్తున్నారు అని మహేంద్ర అని ప్రశ్నించగా, అప్పుడు మహేంద్ర ఆఫీస్ విషయం కాదు మా పర్సనల్ మేటర్ మాట్లాడుకుంటున్నాము అని అనగా రిషి ఫీలయ్యి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: మహేంద్ర చేసిన పనికి జగతిపై విరుచుకుపడ్డ రిషి..?