Guppedantha manasu: ఊహించని ట్విస్ట్​… రిషీ మనసు ముక్కలు.. ఎందుకో తెలుసా..?

Updated on: February 18, 2022

Guppedantha manasu: రిషి ముందే గౌతమ్.. ‘నేను షార్ట్ ఫిలిమ్‌లో హీరోని కాబోతున్నా’ అంటూ ఓవర్ యాక్షన్ చెయ్యడం తెలిసిందే. అయితే రిషి కావాలనే గౌతమ్‌ని మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్‌లో నుంచి తీసివెయ్యమని జగతితో చెప్పడం చూసాము. మరి గుప్పెడంత మనసు సీరియల్​ నేటి హైలెట్స్​ ఏంటో చూసేద్దాం.

Guppedantha Manasu latest episode

‘మేడమ్ షార్ట్ ఫిలిమ్‌లో గౌతమ్ నటించడం నాకు ఎందుకో నచ్చడంలేదు.. మీరేమంటారు?’ అంటాడు రిషి. ‘మీరు ఎలా చెబితే అలా.?’ అంటుంది జగతి. ‘సరే సార్. కానీ మహేంద్ర సార్ గౌతమ్‌కి మాటిచ్చారట’ అంటూ నసుగుతుంది జగతి. దాంతో రిషి.. ‘మేడమ్ నేను ఈ కాలేజ్ ఎమ్‌డీని..’ అంటాడు రిషి. దానితో జగతి ఇంకేమి మాట్లాడదు.

Advertisement

సీన్ కట్ చేస్తే.. గౌతమ్ వసు ఉన్న క్యాబిన్‌లోకి వచ్చి.. వసుని పలకరిస్తాడు. అక్కడే ఉన్న గులాబీని అందుకుని అటు తిరిగి ఉన్న వసుకి గులాబీ పెట్టి ఐ.. అంటూ ఉండగానే.. రిషి వచ్చి నిలబడతాడు. కళ్లు తెరిగి చూస్తే రిషి ఉంటాడు గౌతమ్ బిత్తరపోతాడు. ‘ఏంట్రా ఇలా చాపావు చేతిని..’ అంటే.. ‘చెయ్యి నొప్పి వచ్చి అలా పెట్టానంతేరా’ అంటూ కవర్ చేసుకుంటాడు గౌతమ్. ‘సరే కానీ.. నువ్వు జగతి మేడమ్‌నట ఒకసారి కలువు.. వెళ్లు..’ అంటూ బలవంతంగా గౌతమ్​ని పంపించేస్తాడు రిషి.

ఇక రిషి వసు దగ్గరకంటూ వచ్చి.. ‘వసుధారా ప్రజెంటేషన్‌కి అంతా సిద్ధమా?’ అంటాడు. అప్పుడే వెనక్కి తిరిగిన వసు చూసుకోకుండా రిషికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. అక్కడో ఓ రొమాంటిక్ సీన్ నడుస్తుంది.

మరోవైపు జగతి మహేంద్రతో గౌతమ్ షార్ట్​ ఫిల్మంలో నటించడం వద్దన్న రిషి చేప్పిన విషయం చెప్తుంది.  దాంతో మహేంద్ర కూల్‌గా.. ‘దాని గురించి ఎక్కువగా ఆలోచించకు జగతి.. లైట్ తీసుకో.. ఎక్కువ మంచితనం, మొహమాటం ఉంటే లేని సమస్యలు వస్తాయి.. వదిలెయ్.. నువ్వు చెప్పకుంటే రిషినే గౌతమ్‌తో చెప్పేస్తాడులే’ అంటూ నవ్వుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్​ ‘మేడమ్‌తో మాట్లాడదాం అనుకుంటే.. అంకుల్ ఉన్నారేంటీ? సరేలే.. మళ్లీ మాట్లాడదాం.. అయినా వీళ్లిద్దరినీ చూస్తే అసలు కొలీగ్స్‌లా ఉండరేంటబ్బా’ అని మనసులో అనుకుని వెళ్లిపోతాడు.

Advertisement

ఒకవైపు మిషన్​ ఎడ్యుకేషన్​ గురించి వసూ రిషికి మొత్తం వివరంగా చెబుతుంది. దానికి మురిసిపోయిన రిషి.. గిఫ్ట్‌గా ఏదొకటి ఇవ్వాలని ఆలోచించి.. గౌతమ్​ వదిలి వెళ్లిన గులాబీని వసుకి ఇస్తాడు. దాంతో ఎంతో అపురూపంగా అందుకున్న వసు.. దీన్ని ఎప్పటికీ ఓ జ్ఞాపకంగా దాచుకుంటాను అనుకుంటుంది మనసులో.

ఇక వసు చేత్తో గులాబీ పట్టుకుని వెళ్తుంటే రిషి వెనుకే వెళ్తాడు.. ‘ఎక్కడికి వెళ్తున్నారు’ అంటూ అడ్డుపడతాడు గౌతమ్. ‘ఎక్కడికి వెళ్తే నీకెందుకురా.. నిన్ను జగతి మేడమ్‌ని కలవమని చెప్పాను కలిశావా’ అంటాడు గౌతమ్. ‘కలుద్దామనే వెళ్లాను అక్కడ మేడమ్ అంకుల్ మాట్లాడుకుంటున్నారు..అవును వాళ్లిద్దరూ ఏంట్రీ? చాలా క్లోజ్‌గా, చిన్నప్పటి ఫ్రెండ్స్‌లా చాలా సరదాగా ఉంటున్నారు?’ అంటాడు గౌతమ్. దాంతో రిషికి కోపం వచ్చేస్తుంది. మనసు ముక్కలైపోతుంది. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

వసు ఒంటరిగా ఉన్నప్పుడు రిషి మాట్లాడుతూ.. ‘విన్నావ్ కదా.. గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడో.. నా వ్యక్తిగత జీవితం గురించి? వాడు ప్రశ్నలు వేస్తుంటే ఎలా అనిపించిందో తెలుసా? నా బాధ మీ ఎవ్వరికీ అర్థం కాదు.. మీ మేడమ్‌కి నువ్వైనా చెప్పొచ్చు కదా’ అంటూ అరుస్తాడు. దాంతో వసు కోపంగా.. ‘ఏమని చెప్పమంటారు? అవునన్నా కాదన్నా మేడమ్ మీ..’ అనుకుంటూ ఆగిపోతుంది. మరి ఏం సమాధానం ఇస్తుందో..? రిషిలో ఏదైనా మార్పు వస్తుందో రాదో చూడాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel