RGV Comments : ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది కాంట్రవర్సీ, రక్తపాతం, దెయ్యాలు, బూతు కంటెంట్ చిత్రాలు.. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడు రాము.. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ రాము, రెమో, అపరిచిత్రుడు వేసిన వేషాలన్నీ ఒక్క రామ్ గోపాల్ వర్మలోనే చూసేయచ్చు. ఇతనికి అమ్మాయిలే అందమే ఆనందం.. హీరోయిన్ల అందాలను చూడని జీవితం ఎందుకు వృథా అని తన ఫిలాసఫీలు చెబుతుంటాడు. ఈయన పిచ్చి ఐడియాలను ‘రాముఇజం’ పేరుతో కొందరు నెటిజన్లు ఫాలో కూడా అవతుంటారంటే అతిశయోక్తి కాదు.. ఎంత పెద్ద సీరియస్ మ్యాటర్ అయినా సిల్లీగా తీసుకుంటాడు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ పాటలపూదోట ‘సిరివెన్నెల సీతారామశాస్త్రీ’ మరణంపై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు.‘ సిరివెన్నెల కలం నుంచి జాలువారిన.. ‘సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా’..? అనే పదాలు తనను విపరీతంగా ప్రభావితం చేశాయని చెప్పుకొచ్చాడు.
ఈ పదాల్లోని అర్థమే తన జీవితం అని గుర్తుచేశారు. గన్నులాంటి కలంతో ఎన్నో అద్బుత పాటలు రాసి ఎంతోమంది జీవితాలను ప్రభావితం సిరివెన్నెల గారు తప్పకుండా స్వర్గానికి వెళ్లి ఉంటారు. ‘రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ’లకు నా హాయ్ చెప్పండంటూ కామెంట్స్ చేశారు. నేను తప్పకుండా నరకానికి పోతాను.. బై మిస్టేక్ నేను స్వర్గానికి వస్తే ఇద్దరం కలిసి వోడ్కా తాగుదాం.. నేను ఇంత వరకు మీతో కలిసి సిట్టింగ్ వేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా రాముకు ఇంకా ఎప్పటికీ పిచ్చి తగ్గదని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Naga Shourya Comments : నటి ‘కేతిక శర్మ’ను చూస్తే ‘నాగశౌర్య’కు అది చేయాలనిపిస్తుందట..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world