...

RGV Comments Manchu Laxmi : ‘నీకు హద్దులు అనేవి లేవా’.. మంచు లక్ష్మిపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV Comments Manchu Laxmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇక తాజాగా మంచు లక్ష్మి మీద కామెంట్స్ చేసాడు ఆర్జీవీ. ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మంచు నటి కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలలో మంచు లక్ష్మి కేరళ ప్రాచీన విద్యను నేర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది.
గత మూడు రోజులుగా కేరళ ప్రాచీన విద్యలో శిక్షణ తీసుకుంటున్న వీడియోలను మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇటీవలే మంచు లక్ష్మి తమిళ్ సినిమాలో నటిస్తున్న విషయం అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బహుశా ఈ సినిమా కోసమే మంచు లక్ష్మి ఇలా కేరళ విద్యలో ప్రావీణ్యం పొందుతున్నట్టు తెలుస్తుంది.

అయితే మంచు లక్ష్మి షేర్ చేసిన వీడియోలపై ఆర్జీవీ కామెంట్స్ చేసాడు. నీకు హద్దులు అనేవి లేవా? నువ్ ఇలా చేయడం నేను నమ్మలేక పోతున్న..ఇది ఎవరో చెప్పని వారికీ లక్ష రూపాయలు ఇవ్వను అంటూ ఆర్జీవీ కామెంట్స్ చేసాడు. అయితే ఈ ట్వీట్ పై మంచు లక్ష్మి ఆర్జీవీ కి రిప్లై కూడా ఇచ్చింది. ఈ రోజుకు నా జీవితానికి ఇది చాలు.. మీరు నన్ను పొగిడేశారు.. అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు.. నటిగా నేను చేయనిదంటూ లేదు.. నేను ఆర్టిస్టిక్ కిల్లర్ నే అంటూ రిప్లై ఇచ్చింది. వీరిద్దరి సంభాషణ మొత్తం నెటిజెన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

Read Also : Nithya Menen Comments : త్రివిక్రమ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్.. ఎప్పుడు అలా చూస్తారంటూ..!