Nithya Menen Comments : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నిత్యా మీనన్. కానీ ఆమెకు వచ్చిన అవకాశాలను కొన్నిటిని వాదులు కోవడం వల్ల కెరీర్ లో వెనక బడి పోయింది. ఆమెకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ తన కెరీర్‌లో కొన్ని సినిమాలు చేసిన ఆమె చేసిన పాత్రలన్నీ గుర్తుండిపోయే విధంగానే ఉంటాయి. ఈమె చాలా రోజుల తర్వాత చేసిన సినిమా స్కైలాబ్. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ప్రెసెంట్ ఈ బ్యూటీ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి చేస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఉంది. ఇందులో పవర్ స్టార్ కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. నిత్యా మాట్లాడుతూ.. నా అంతటా నేను అవకాశాల కోసం ఎవ్వరి దగ్గరకు వెళ్ళలేదు.. ఆ పాత్రకు నేను సరిపోతాను అనిపిస్తే వారే నా దగ్గరకు వచ్చే వారు.
ఇప్పుడు చేస్తున్న భీమ్లా నాయక్ సినిమా అవకాశం కూడా అలానే వచ్చింది అని నిత్యా మీనన్ తెలిపింది. ఇక ఈ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి కూడా మాట్లాడింది. ఆయన నన్ను ఒక రౌడీ అమ్మాయి లాగానే చూస్తారు.. అందుకే సన్ ఆఫ్ సత్యమూర్తిలో అలంటి పాత్ర ఇచ్చారు…అలాగే ఇప్పుడు భీమ్లా నాయక్ లో కూడా అలా రౌడీ పాత్రలోనే కనిపిస్తానని ఆమె తెలిపారు. ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రెసెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also : RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world