Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌కి వేళాయే… ఎప్పుడంటే?

Updated on: February 18, 2022

Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ” భీమ్లా నాయక్ “. ఈ చిత్రనికి డైరెక్టర్ గా సాగర్ కే చంద్ర చేస్తుండగా… త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలానే ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్… రానాకి జోడిగా సంయుక్త మీనన్ చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట చిత్రం అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

వకీల్ సాబ్ తర్వాత పవన్ నటిస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ నెల 25న భీమ్లా నాయక్ ను విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో మూవీ గురించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‏ను రేపు (ఫిబ్రవరి 19న) రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అదే విధంగా ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ వార్తలతో పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

Advertisement

Read Also : అంజీరతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. రోజూ తినాల్సిందే..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel