...

RGV Comments : చంద్రబాబు ఏడ్చిన ఘటనపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

RGV Comments : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. నిన్నటికి నిన్న ప్రెస్ ముందు ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టుకున్నారు. మళ్లీ తిరిగి సీఎం అయ్యేంత వరకూ అసెంబ్లీకే వెళ్లనని ఆయన శపథం చేశారు. ఇక ఆయన శపథం మాటెలా ఉన్నా కానీ ఈ విషయం పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. ఆయన తన ట్విటర్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ అసలు చంద్రబాబు ఏడవడానికి కారణం ఇదే అంటూ తెలిపారు. ఇంతకీ ఆ వీడియోలో వర్మ ఏం చెప్పారంటే..

ఎవరెలా పోయినా కానీ తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటారు. ఆయన తను అనుకున్నది అనుకున్నట్లు చెప్పేస్తారు. ఎవరు ఏమనుకుంటారని ఆయన మొహమాట పడడు. తనేమని భావిస్తున్నాడో నలుగురికి తెలియజేయడంలో వర్మ అందరికంటే ముందు ఉంటాడు. ఇక చంద్రబాబు ఏడ్చిన విషయంలో కూడా వర్మ తనదైన శైలిలో స్పందించాడు. అసలు చంద్రబాబు తన కొత్త సినిమా ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూడడం వల్లే ఏడ్చాడని తన మిమిక్రీ వాయిస్ తో ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు.

ఇక చంద్రబాబు ఏడుస్తున్నప్పటి వీడియో క్లిప్ ను ఎడిట్ చేసి షేర్ చేసిన వర్మ అందులో తన మిమిక్రీ వాయిస్ ను యాడ్ చేశారు. చంద్రబాబు మాట్లాడినట్లుగా క్రియేట్ చేశాడు. ఇందాకే వర్మ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూశాను. ఎలా అభివర్ణించాలో నాకైతే మాటలు రావడం లేదని చెబుతూ బాబు కంటతడి పెట్టుకున్నట్లుగా క్రియేట్ చేశాడు. ఇలా చెప్పినందుకు చంద్రబాబుకు రామ్ గోపాల్ వర్మ ధన్యవాదాలు కూడా తెలిపాడు.

Read Also : Ys Jagan : అమిత్ షాకు విభజన సమస్యలు విన్నవించిన జగన్… మరి షా ఏం చేస్తారో..?