Ys Jagan : ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేరడం లేదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అసలు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువగా పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువగా లెక్క చేయడం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన విభజన హామీలను కూడా ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చడం లేదు. తర్వాత ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కూడా నెరవేర్చడం లేదు. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సారి విభజన హామీలను గురించి లేవనెత్తినా కానీ కేంద్ర పెద్దలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అందరికీ తెలుసు.
ఇక ఎన్నిసార్లు విభజన హామీలను గురించి ప్రస్తావించినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదని జగన్ భావించారు కాబట్టి తిరుపతిలో ఇటీవల దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమక్షంలోనే జగన్ ప్రస్తావించారు. ఇక ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా త్వరలోనే ఏపీ రాష్ట్ర అన్ని ప్రయోజనాలను కేంద్రం తీరుస్తుందని హామీ ఇచ్చారు. సాక్ష్యాత్తూ రాజ్యసభలో చేసిన ప్రకటనలకే దిక్కు లేదు కానీ అమిత్ షా ఈ మీటింగ్ లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.