...

Chandrababu : తెలుగుదేశం పార్టీకి మున్ముందు  అన్నీ పరీక్షలే.. తట్టుకుని నిలబడగలదా..?

Chandrababu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని మీకు నేనున్నానంటూ  అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరై రెండోసారి కూడా అధికారం చేపట్టి ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూపించారు.

ఇక టీడీపీ పని అయిపోయిందని అనకునే టైంలో 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో విలన్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు, పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, హైదారాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తారని టీడీపీకి రాష్ట్రం విడిపోయాక అవకాశం ఇచ్చారు ఏపీ ప్రజలు. కానీ చంద్రబాబు తాను ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయారు.

అభివృద్ధిని కంప్యూటర్ స్క్రీన్లపై చూపించి ప్రశ్నించిన వారిని తొక్కిపెట్టారు. ఇక కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసిన వైసీపీ పార్టీని తొక్కడమే పనిగా పెట్టుకున్న బాబు ఆనాడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని సీబీఐ కేసుల రీఓపెన్ పేరుతో నానా ఇబ్బందులకు గురిచేశాడు. వైసీపీ నుంచి 23మందికి పైగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైసీపీని ఊపిరాడకుండా చేశాడు. ఇలా ఐదేండ్ల కాలాన్ని అభివృద్ధిపై కోసం రాజధాని అభివృద్ధి పేరిట వేల కోట్ల నిధులు స్కాం చేశారని వైసీపీ ఆరోపించింది. అదే దూకుడుతో 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించింది.

నాటి నుంచి టీడీపీ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వరుస ఓటములు, కేడర్ దూరం కావడం, 23 ఎమ్మెల్యే స్థానాల్లో నలుగురు వైసీపీ సపోర్టుగా మారారు. పలువురు ఎంపీలు బీజేపీలో చేరారు. ఇకపోతే కుప్పం చంద్రబాబుకు  కంచుకోట. దానిని వైసీపీ బద్దలు కొట్టింది.  స్థానిక ఎన్నికలకు, ఉపఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా అన్నింటిలోనూ వైసీపీదే హవా.

చివరగా నిన్న అసెంబ్లీలో చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందని మీడియా ముందు చిన్న పిల్లాడిలా గుక్కతిప్పుకోకుండా ఏడిస్తే చాలా మంది చలించిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే కేడర్ ను ఏకం చేయాలి, నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను యాక్టివ్ చేయాలి. జనాల్లోకి వెళ్లాలి. రానున్నది టీడీపీకి పరీక్షా కాలమే.. మరీ తెలుగు తమ్ముళ్లు వాటిని తట్టుకుని నిలబడతారో లేదో వేచిచూడాలి.

Read Also : TRS-BJP : టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాల్లో బలైపోతుంది ఎవరు..?