Ram Charan Comments : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ టాపిక్స్‌లో సమంత, నాగచైతన్య విడాకుల విషయం ఒకటి. వీరు విడిపోయి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఈ విషయానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడటం లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. వాస్తవానికి టాలీవుడ్‌లో వీరిది క్యూట్ పెయిర్.
వీరిద్దరి కాంబినేషన్‌లో ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి మూవీస్ వచ్చాయి. ముందు ప్రేమలో పడిన వీరు తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కేవలం నాలుగేండ్లలోనే వీరి తమ బంధానికి స్వస్తి పలికారు. ఇందుకు స్పష్టమైన కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. ఇక వీరు విడిపోయారనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు వారి ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ టీం ప్రమోషన్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది. అసలే దర్శకధీరుడు రాజమౌళి.. మరో వైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వీరి కాంబోలో భారీ బడ్జెత్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సైతం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ రామ్ చరణ్ తో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సమంత గురించి చెప్పాలని రామ్ చరణ్ కు యాంకర్ అడిగారు.
ఇందుకు రామ్‌చరణ్ బదులిస్తూ.. సమంత కమ్ బ్యాక్… బిగ్గర్, స్ట్రాంగర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సమంత ఫ్యాన్స్ సైతం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున ఫ్యామిలీ కి బయపడొద్దని, ధైర్యంతో ఉండాలని సమంతకు రామ్‌చరణ్ సూచించాడని కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత చేతినిండా మూవీస్ తో చాలా బిజీ అయిపోయింది. హాలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వనుంది.
Read Also : Ram Charan NTR : ఎన్టీఆర్‌తో తన బంధంపై చెర్రీ కామెంట్స్..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world