Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వానలు.. బయటకు రావొద్దంటూ సూచన!

rain-forecast-and-weather-update-in-telnagan
rain-forecast-and-weather-update-in-telnagan

Weather Report : తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలందరినీ చాలా జాగ్రత్తగా ఉండలాని.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని తెలిపింది. ఎందుకంటే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, పొడి గాలులు వీస్తున్నాయని వివరించింది.

వేడి గాలులు, వడగళ్ల వానల దృష్ట్యా చిన్న పిల్లలు, వృద్ధులను ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపకూడదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒక వేళ అత్యవసర పరిస్థితుల కారణంగా వచ్చినా త్వరగా పనులు ముగించుకొని బయటకు వెళ్లాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

ఏప్రిల్ నెల ఆరంభంలోనే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఏ స్థాయిలో సూర్యుడు మండిపోతాడోనని ప్రజలు భయపడిపోతున్నారు. పగలంతా ఎండతో.. రాత్రిళ్లు వేడి గాలులతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు.

Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

Advertisement