రాష్ట్రంలో భానుడు భగభగా మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు నిప్పుల కొలమిలా భగభగ మంటున్నాడు. ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 43.4 డిగ్రీలు, నిజామాద్ రూరల్ 42.1, నిజామాబాద్ డిచ్‌పల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందొందేకు జ్యూస్ లు, కొబ్బరి బోండాలు వంటివి తాగుతున్నారు. అంతే కాకుండా పగటి పూట చాలా వరకు బయటకు రావడం లేదు.
మరో వైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరిగాయి. వేడి వేడి గాలులుతో ప్రజలు ఆగమై పోతున్నరు. అయితే ఆదిలాబాద్‌లో ఆదివారం రాత్రి గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నిజామాబాద్‌లలో 27, హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 26, దుండిగల్‌లో 25, హనుమకొండలో 24 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణంగా చలి కాలం, వర్షా కాలంలో పగటి పూట ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.