Petrol Prices Today : చాలా రోజుల తర్వాత వాహన దారులకు కాస్త ఊరట లభించింది. దాదాపు 17 రోజుల వ్యవధిలో కేవలం మూడు రోజులు మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంటే మొత్తం 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. గత కొన్ని రోజులుగా చమురు సంస్థలు దాదాపు 10 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. అయితే ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41కు చేరగా.. డీజిల్ ధర రూ.96.67కు పెరిగింది.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.104.77కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.119.49ఉండగా… డీజిల్ ధర రూ.105.49కు చేరింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది. వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగబాకింది.
Read Also : RGV Dangeours Movie : ‘డేంజరస్ మూవీ’పై వర్మ సంచలన నిర్ణయం.. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఎదుర్కొంటా… వీడియో..!