Petrol Prices Today : పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 16 రోజుల వ్యవధిలోనే మొత్తం 14 సార్లు పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు సంస్థలు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41కు చేరగా.. డీజిల్ ధర రూ.96.67కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.120.51కు చేరింది. డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.104.77కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.119.49కు చేరింది. డీజిల్ ధర రూ.105.49కు ఎగబాకింది.
గుంటూరులో పెట్రోల్ ధర రూ.120 దాటింది. తాజాగా పెంచిన 87 పైసలతో.. పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.87 పైసలు పెరిగి.. రూ.106.91కు చేరుకుంది. వైజాగ్‌లో 87 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర 87 పైసలు అధికమై.. రూ.105.66కు ఎగబాకింది.
Read Also : Petrol price today: మళ్లీ పెరిగిన పెట్రోల్, జీజిల్ ధరలు.. ఎక్కడెంతో తెలుసా?