Samantha Naga Chaitanya : సమంత నాగ చైతన్యల జోడీ అంటే ఇష్టపడని వాళ్లుండరు. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే షూటింగ్ లోనే వారి ప్రేమ ప్రారంభమైంది. చాలా ఏళ్ల పాటు సాగిన వారి ప్రేమ రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. కానీ అనుకోకుండా కొన్నేళ్లలోనే వాళ్లు విడాకులు తీసుకోవడం కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులను షాక్ కి గురి చేసింది.
అయితే విడాకుల తర్వాత నుంచి హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య ఎక్కడా తమ డైవర్స్‌కు గల కారణాన్ని వెల్లడించలేదు. అలాగే ఒకరి గురించి మరొకరు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అంతే కాకుండా సామ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న చై ఫొటోలను డిలీట్ చేసేసింది. కానీ ఇప్పుడు ఆమె చేసిన ఓ పోస్ట్ చూస్తుంటే వారు కచ్చితంగా కలిసిపోతారనే తెలుస్తోంది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నాగచైతన్య- సమంత చివరగా కలిసి నటించిన సినిమా ‘మజిలీ’. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఏప్రిల్ 5తో ఈ చిత్రం విడుదలై మూడేళ్లు అయింది. దీంతో ‘3 ఇయర్స్ ఫర్ మజిలీ’ అంటూ చైతూ పోస్టర్‌ను షేర్ చేసింది సామ్. డైవర్స్ తర్వాత సామ్ తొలిసారి చై ఉన్న ఫొటోను పోస్ట్ చేయడం వల్ల కాసేపట్లోనే ఇది నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
Read Also : Samantha Yashoda : అక్కినేని బ్రదర్స్‌తో సమంత ‘యశోద’ సవాల్.. తగ్గేదేలే సామ్..!