Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Samantha : ఆ పాట నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.. మరోసారి ఐటమ్ సాంగ్ పై సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha : సమంత తన సినిమా కెరీర్ లో దూసుకుపోతూనే వ్యాపారంలోను అడుగుపెడుతూ తన సత్తా చూపిస్తోంది.. అలా తన మార్కును ఇటు సినీరంగం పైన అటు వ్యాపార రంగం పైన వేస్తోంది. సమంత అనగానే అందరి హీరోలతో హిట్ సినిమాలు తీసిన లక్కీగర్ల్ గా అనిపిస్తుంది. తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ మంచి ప్రాజెక్టలను ఎంచుకుంటుంతోంది సామ్. కొన్నిసార్లు చాలా బోల్డ్ కామెంట్స్,ఫొటోస్ తో ట్రోల్ కి కూడా బాగానే గురవుతుంది. ... Read more

By Ramesh Babu

Published on: March 12, 2022 12:11 PM

Updated on: March 12, 2022 12:52 PM

---Advertisement---

Samantha : సమంత తన సినిమా కెరీర్ లో దూసుకుపోతూనే వ్యాపారంలోను అడుగుపెడుతూ తన సత్తా చూపిస్తోంది.. అలా తన మార్కును ఇటు సినీరంగం పైన అటు వ్యాపార రంగం పైన వేస్తోంది. సమంత అనగానే అందరి హీరోలతో హిట్ సినిమాలు తీసిన లక్కీగర్ల్ గా అనిపిస్తుంది. తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ మంచి ప్రాజెక్టలను ఎంచుకుంటుంతోంది సామ్. కొన్నిసార్లు చాలా బోల్డ్ కామెంట్స్,ఫొటోస్ తో ట్రోల్ కి కూడా బాగానే గురవుతుంది.

తను నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయింది.నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి తర్వాత విడాకులతో కూడా అంతే దృడంగా తన కెరీర్ లో దూసుకుపోతోంది. ఇక ఇటీవల సమంత చేసిన ఊ అంటావా మావ ఊహు అంటావా పాట ఇండియాని ఒక ఊపు ఉపేసింది. పుష్ప సినిమాలోని ఈ పాట సమంత కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఇంతలా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సాంగ్ గురించి తాజాగా సమంత స్పందించింది, సమంత ఇటీవల ముంబయిలో జరిగిన క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది సమంత, అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను. పుష్ప మూవీ లోని ‘ఊ అంటావా’ పాట పాన్‌ ఇండియా లెవల్‌ లో ఈ రేంజ్‌ విజయాన్ని అందుకుంటుందని ఊహించలేదు అని సమంత తెలియజేసింది, తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా నేను ఇప్పటి వరకు చేసిన మూవీ లను మర్చిపోయారు, ‘ఊ అంటావా’ సాంగ్ తోనే నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు అంటూ సమంత చెప్పుకొచ్చింది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.