Intinti Gruhalakshmi April 6th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. కొత్త ఇంట్లోకి చేరిన లాస్య కొత్త ఇంట్లోకి రకరకాల వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తుంది. ఇంతలో నందు అక్కడికి వచ్చి ఇవన్నీ ఎక్కడివి అని అడగడంతో, పాతిక వేలు పెట్టి ఆన్లైన్లో షాపింగ్ చేశాను 5000 డిస్కౌంట్ కూడా వచ్చింది అని సంతోషంగా లాస్య చెప్పడంతో అప్పుడు కోప్పడిన నందు మనం ఇంకా సెటిల్ కాలేదు, అద్దె ఇంట్లో ఎన్ని షోకులు అవసరమా పొదుపు ఎలా చేయాలో తులసిని చూసి నేర్చుకో అని అనడంతో లాస్య కోపంతో నందు పై విరుచుకు పడుతుంది.
మరొక వైపు లాస్య బ్యాంకు నుంచి ఫోన్ వస్తుంది. బ్యాంకులో లోను ఇవ్వలేదని చెప్పడంతో తులసి శశికళ కు ఎలా డబ్బులు కట్టాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో శశికళ ఎంట్రీ ఇస్తుంది. ఏందమ్మి ఎలా ఉన్నావు.. రావలసిన టైం కంటే ముందే వచ్చారు ఏంటి అని తులసి అడగగా.. అప్పు ఇచ్చాను కదా కంగారు ఉంటుందిలే ఉంటుంది శశికళ.
నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అనగా కాస్త టైం ఇవ్వండి మీ అప్పు తీరుస్తాను అని అంటుంది తులసి. అప్పుడు శశికళ నేను ఒక ఉపాయం చెబుతాను నా మాట వింటే నీ చేతికి 20 లక్షలు వస్తుంది,నా అప్పు తీరిపోతుంది,కాకపోతే ఇల్లు నాది అవుతుంది అని అనడంతో తులసి షాక్ అవుతుంది. ఇంతలో తులసి తోడికోడలు భార్య ఎంట్రీ ఇచ్చి ఇంట్లో నీకు ఎంత హక్కుందో నాకు అంతే హక్కు ఉంది అమ్మే హక్కు నీకు లేదు.
ఎక్కువ మాట్లాడితే మామయ్యను మోసం చేసి ఇల్లు రాయించుకున్నావు అని చెప్పి కోర్టు కి వెళ్తాను అని అనడంతో తులసి షాక్ అవుతుంది. మరొకవైపు శశికళ రెండు రోజులు టైం ఇస్తున్నాను అప్పు తీర్చకపోతే ఇల్లు నా పేరు రాయించుకుంటాను ఎవరు అడ్డుపడినా బాధ్యత నీదే అంటూ శశికళ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. భాగ్య రావడంతో అనసూయ భాగ్య పై మండిపడుతుంది.
ఎప్పుడు మమ్మల్ని చూసింది లేదు అలాంటిది ఈ రోజు ఇంటిలో వాటా అడుగుతావా ఉంటూ అనసూయ మండిపడుతుంది. అయినా కూడా భాగ్య ఏ మాత్రం తగ్గకుండా నీ చిన్న కొడుకు వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు ఎలా అయినా నాకు ఇంట్లో వాటా కావాల్సిందే లేకపోతే నేను కోర్ట్ కి వెళ్తాను అని తెగేసి చెబుతుంది. ఆ తర్వాత అనసూయ భాగ్య ను బయటకు గెంటేసే ప్రయత్నం చేయగా తులసి అడ్డుకుంటుంది.
అప్పుడు భాగ్య మరింత రెచ్చిపోతూ నీకు రేపటి వరకు సమయం ఇస్తున్న అంతవరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది భాగ్య. అనసూయ, పరంధామయ్య లో భాగ్య పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉంటారు. వారిని తులసి ఓదార్చే ప్రయత్నం చేస్తూ వారితో కొద్దిసేపు మాట్లాడుతుంది. ఆ తరువాత భాగ్య ఫోన్ చేసి జరిగిందంతా వివరిస్తుంది. అప్పుడు లాస్య, భాగ్య ఇద్దరు కలిసి సరికొత్త ప్లాన్ వేస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi: లాస్య ప్లాన్ ను తిప్పికొట్టిన దివ్య.. తులసీ పై మండి పడుతున్న లాస్య..?