Guppedantha Manasu April 6 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. క్లాసులో రిషి అందరి ముందు వసు ని అవమానించే విధంగా మాట్లాడతాడు. దీనితో వసుధారా హర్ట్ అవ్వడంతో మళ్లీ వసు ని నవ్వించడానికి కొన్ని టాపిక్ ల గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత వసు వెళ్లి రిషి క్యాబిన్ లో కూర్చొని ఉండగా ఫన్నీగా లోపలికి రావచ్చా మేడం అని అడుగుతాడు. అప్పుడు వసు అయ్యో సార్ ఇది మీ క్యాబిన్ మీరు ఎప్పుడైనా రావచ్చు అని అంటుంది.
అప్పుడు రిషి ఏంటి చెప్పు ఇలా వచ్చావు అని అడగగా దానికి వసు నేను రెండు ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను సార్ అని అంటుంది. చెప్పు ఏంటి అవి అన్ని రిషి అడగగా ఒకటి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మీరు పట్టించుకోవడం లేదు అని అనడంతో అప్పుడు రిషి ఆ ప్రాజెక్ట్ గురించి మహేంద్ర సార్ జగతి మేడం చూసుకుంటారు అని అంటాడు.
ఇక రెండవ ప్రశ్న ఏంటి అని అడగగా నేను మీ పిఏ ఉన్నానా లేదా సార్ అని అడగగా అది నీకే వదిలేస్తున్నాను అని అంటాడు. ఇంతలో జగతి అక్కడికి వచ్చి మహేంద్ర టాబ్లెట్ వేసుకోవడం లేదు సార్ ఎంత చెప్పినా వినడం లేదు మా ఆయన మా అబ్బాయిని మిస్ అవుతున్నాడు.
నాకు 20 ఏళ్లు దూరమున్న ఎప్పుడూ అంతలా బాధ పడలేదు కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది జగతి. జగతి వెళ్లిపోయిన తర్వాత మహేంద్ర గౌతమ్ కి ఫోన్ చేసి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి డాడీని పిలుచుకొనిరా అని చెబుతాడు.
ఆ తర్వాత గౌతమ్, రిషి గురించి జగతికి కంప్లైంట్స్ ఇవ్వగా నా గురించి పొగడ్తలు చెబితే వింటాను కంప్లీట్ చెబితే వినను అని ఫన్నీగా సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది జగతి. ఆ తర్వాత మహేంద్ర అని పిలుచుకునే గౌతం హాస్పిటల్ కి వెళ్తాడు.
మరొకవైపు జగతి, వసు కారులో కూర్చుని రిషి గురించి మాట్లాడుతూ ఉంటారు. రిషి సార్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటుంది వసుధార. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Varun Tej: నిహారిక పబ్ వ్యవహారం… వరుణ్ మెడకు చుట్టుకొనుందా… ఆందోళన చెందుతున్న మెగాఫ్యామిలీ!