డబ్బు సంపాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ అది ఈజీ ఏం కాదు. కొందరైతే మనీ సంపాదించేందుకు ఎంతో కష్టపడతారు. అయితే కొందరు మాత్రం తమ తెలివితో డబ్బు సంపాదిస్తుంటారు. లక్ష్మీ దేవి కటాక్షం ఎవరికైతే ఉంటుందో వారి వద్ద డబ్బు నిలుస్తుందని ఓ నమ్మకం. ఇదే విషయాన్ని ఆచార్య చాణక్యుడు తన కౌటిల్య అర్థశాస్త్రంలో చెప్పాడు. కష్టపడి పని చేయడంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీ జేలి సంతోషిస్తుందని చాణక్యుడు తన గ్రంథంలో పేర్కొన్నాడు.
జీవితంలో లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల జీవితం సరళంగా, సులభంగా ఉంటుందని. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆనందం, శ్రేయస్సు కారకంగా వారి అభివృద్ధిలో ఎలాంటి అడ్డంకులు ఉండవని కౌటిల్యుడు వెల్లడించాడు. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని వెల్లడించారు. అయితే మనం సంపాదించే డబ్బు మన వద్ద స్థిరంగా ఉండాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
పదవిని, ప్రతిష్టను దుర్వినియోగం చేయవద్దని అంటా చాణక్యుడు. పలుకుబడిని ఉపయోగించి బలహీనులను వేధించే వారు వారిని అవమానించి, వారి హక్కులను లాగేసుకునేవారి వద్ద లక్ష్మీ అస్సలు నిలిచి ఉండదని చాణక్యుడు తన గ్రంథంలో వెల్లడించారు. లక్ష్మీ దేవికి అలాంటి వాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. తర్వాత వారు ఇబ్బందులను, వైఫల్యాన్ని మాత్రమే పొందుతారు. డబ్బు కోసం అత్యాశ పడవద్దని చాణక్యుడు చెప్పే మరో నీతి. జీవితంలో డబ్బు కష్టపడితేనే వస్తుంది. కష్టపడని డబ్బు ఎక్కువ కాలం నిలవదు. ఇలా ఆర్జించే డబ్బు ఎప్పటికీ సంతృప్తిని ఇవ్వదు.
దురాశతో సంపాదించే వారిలో కూడా అనేక లోపాలు ఉంటాయని వెల్లడించారు. అత్యాశ కలిగిన వారికి లక్ష్మీ అనుగ్రహం లభించదు. వ్యక్తుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. చాణక్య నీతి ప్రకారం తప్పుడు సహవాసం ఎల్లప్పుడూ హాని కలిగిస్తాయి దీని వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ప్రయోజనం లేదు. తప్పుడు అలవాట్లతో ఉన్న వ్యక్తులను లక్ష్మీ దేవి చాలా త్వరగా వదిలేస్తుంది.
అన్నింటికంటే ముఖ్యమైనది డబ్బును అనవసరంగా ఖర్చు చేయకూడదు. అలాగే అవమానించకూడదు. పొదుపు చేయడం ఎప్పుడూ అత్యుత్తమమైన మార్గం అని చాణక్యుడు చెబుతాడు.