Medaram Jathara : మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన ఈ జాతర ఇవాళ సాయంత్రంతో అయిపోతుంది. వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు ఆదివాసీ పూజారులు. మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్టం చర్యలు తీసుకున్నారు.
స్థానిక మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృ వియోగం వల్ల జాతరలో పాల్గొనలేకపోయారు. దాంతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నీ తానై జాతర సక్సెస్‌కు కారణమయ్యారు. ఇక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, ఈ నాలుగు రోజులు అమ్మవార్లను దర్శించుకున్న భక్త జనమంతా కలిపి ఇప్పటి వరకు కోటి మందికిపైగా దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండు రోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి, నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World