...

Devotional News : కుడి కాలు ముందు అనడం వెనుక అసలు సీక్రెట్ అదేనా ?

Devotional News : సంప్రదాయాలు, పద్దతులు అనేవి ఎప్పటి నుంచే మన పూర్వీకులు పాటిస్తూ వస్తున్నారు. కొందరు వాటిని మూఢనమ్మకాలు అని కొట్టేపారేసిన కానీ ఆ సంప్రదాయాలకు, [పద్దతులకు ఒక విలువ ఉంది. జ్యోతిష్యం ప్రకారం, వాస్తు ప్రకారం పలు సాంప్రదాయాలను ఫాలో అప్పట్లో ఫాలో అయ్యారు. ఇప్పటికీ కూడా వాటిని ఫాలో అవుతున్న కొందరికి అసలు ఆ పని ఎందుకు చేస్తామో తెలీదు. ఉదాహరణకు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తారింట్లో మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు.

ఈ విధంగా కుడి కాలు పెట్టి లోపలికి రమ్మని మన పెద్దవారు చెప్పడం మనం వింటూనే ఉంటాం. కుడికాలు లోపలికి పెట్టి రావడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రామాయణంలో హనుమంతుడు సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించే ముందు ఒక విషయంపై ఆలోచించారట. కుడికాలు లోపలికి పెట్టి ప్రవేశిస్తే రావణరాజ్యం సకల సంతోషాలతో ఉంటుందని భావించిన హనుమంతుడు రావణ రాజ్యంలోకి ఎడమ కాలు పెట్టి ప్రవేశించాడు.

ఈ విధంగా రావణాసురుడి రాజ్యాన్ని హనుమంతుడు అంతం చేశాడు. అందుకోసమే ఏదైనా శుభకార్యాలప్పుడు లేదా ఎవరికైనా మంచి జరగాలని ఆశించినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడి కాలు పెట్టి వెళ్ళటం వల్ల ఆ కుటుంబం సుఖసంతోషాలను కలిగి ఉంటారని చెబుతారు. ఎడమ కాలు లోపల పెట్టి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కలహాలు, గొడవలు తలెత్తుతుంటాయి. అందుకోసమే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు లేదా కొత్తగా పెళ్లి అయిన వారు కుడికాలు లోపలికి పెట్టి వెళ్లటం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతారు.