...

Ram Charan : రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న : రణవీర్ సింగ్

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ ఆర్ ఆర్ ఆర్ “ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా నటిస్తున్నా విషయం తెలిసిందే. మగధీర సినిమా తర్వాత జక్కన్న తో చరణ్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా… తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు నందమూరి ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గంగూబాయి కతియావాడి ‘ మూవీలో పాటలకు డ్యాన్స్ చేశాడు. కాగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలానే తాజాగా ఆర్ ఆర్ ఆర్ లోని ‘నాటు-నాటు’ సాంగ్ గురించి కూడా రణ్‌వీర్ సోషల్ మీడియా లైవ్ సెషన్‌లో ప్రస్తావించాడు.

తనకు మగధీర సినిమా అంటే ఇష్టమని… రామ్ చరణ్ అంటే మరింత ఇష్టమని చెప్పాడు. తాను ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఇక రణ్‌వీర్ శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు హిందీ రీమేక్ లో చేయనున్నాడు. చెర్రీ కూడా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లిట్ అయ్యాక రణ్ వీర్ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.