...

Marriage News : ఈ రాశుల వారికి 2022 లో పెళ్లి గ్యారంటీ..!

Marriage News : వివాహం అనేది ఒక పవిత్ర బంధం. కొందరికి లవ్ మ్యారేజ్ లు కావచ్చు, మరి కొందరివి పెద్దలు కుదర్చిన వివాహం కావచ్చు. ఏదైనా ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణాన్ని పెళ్లితో ప్రారంభిస్తారు. కాగా ఈ 2022 లో కొన్ని రాశుల వారికి కచ్చితంగా వివాహం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఏ యే రాశులకు వివాహ యోగం ఉందో మీకోసం…

కర్కాటక రాశి : మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉంటుంది. సరైన శక్తులు మిమ్మల్ని వివాహం వైపుకు లాగుతాయి. మీకు తగిన భాగస్వామిని కూడా కనుగొంటాయి. ఈ రాశివారికి ఎక్కువగా ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది.

మీన రాశి : బలమైన శక్తులు మిమ్మల్ని వివాహం వైపు నడిపిస్తాయి. ఈ సంవత్సరం మీ నిశ్చితార్థం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎంతో కాలంగా మీ సోల్ మేట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. ఆ కల నేటితో తీరుతుంది. మీకు జీవితాంతం తోడుండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు.

ధనస్సు రాశి : ఈ సంవత్సరం మీరు నిశ్చితార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితాంతం మిమ్మల్ని ఆరోగ్యంగా , సంతోషంగా ఉండేలా చేసే వ్యక్తి పెళ్లి బంధంతో మీ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ వ్యక్తికి మీరు కట్టుపడి ఉండాలి. అప్పుడు మీ బంధం చివరి వరకు ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాదే నిశ్చితార్థం, పెళ్లి రెండూ జరిగే అవకాశం ఉంది.

daily horoscope of differerent zodiac signs for today

కుంభ రాశి : మీరు సరైన అవకాశం కోసం వేచి ఉండాలి ఈ ఏడాది ముగిసే సమయానికి మీ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయి. మిమ్మల్ని అమితంగా ఇష్టపడేవారు మీ జీవితంలోకి అడుగుపెడతారు.. మీరు పెళ్లి చేసుకుని ఎవరితోనైనా స్థిరపడేందుకు ఇదే సరైన సమయం. మీకు సరైన భాగస్వామిని ఎంచుకునే శక్తిని మీరే ఇవ్వాలి. ఎవరి జోక్యం లేకుండా మీకు మీరే ఎంచుకోవచ్చు.

తుల రాశి : మీరు ఈ సంవత్సరం ఎవరికైనా ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. మీరు సాధారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సందేహాస్పదంగా ఉంటారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది మంచి అడుగు. మీరు దానిని విశ్వసించినప్పుడే మీ వివాహం పరిపూర్ణంగా ఉంటుంది. మీరు మీ ప్రేమను తెలియజేస్తే..వారు పెళ్లితో మీ జీవితంలోకి అడుగుపెడతారు.