...

Devotional News : మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవే..!

Devotional News : మార్చి మాసంలోకి అడుగుపెట్ట బోతున్నాం. వేసవి మాసానికి ప్రారంభంగా చెప్పుకునే ఈ నెలలో కూడా మహాశివరాత్రి, హోలీ వంటి ముఖ్యమైన పండుగలతో పాటు శుభముహుర్తాలు, వ్రతాలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం…

మహా శివరాత్రి : హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే వేడుకలలో ఇది కూడా ఒకటి. మార్చి 1, మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన పూజలను నిర్వహిస్తుంటారు. ఆరోజు హిందువులందరూ ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తారు. భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. ఎంతో పవిత్రమైన రోజున శివనామ స్మరణ చేయాలంటారు. అలా శివుడ్ని కోరిన కోరికలు అన్ని నేరవేరుతాయని అంటారు. అలాగే కష్టాల నుంచి విముక్తి కూడా పొందవచ్చునని ఎంతోమంది విశ్వసిస్తారు.

దయానంద సరస్వతి జయంతి : దయానంద సరస్వతి జయంతి 2022 మార్చి 8వ తేదీ మంగళవారం నాడు వచ్చింది. భారతీయ సమాజ అభివృద్ధికి గొప్ప కృషి చేసిన గొప్ప తత్వవేత్త మరియు సంస్కర్త దయానంద సరస్వతి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 మంగళవారం నాడు వస్తుంది. ఈరోజున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు మరియు సంఘాలకు మహిళలు చేసిన కృషికి గౌరవం లభిస్తుంది. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

రామకృష్ణ జయంతి : భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంస్కర్తలు మరియు సాధువులలో శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరు. మార్చి 15 రోజున కోల్ కతాలో జన్మించిన రామకృష్ణకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఈయన స్వామి వివేకానందకు ఇష్టమైన గురువు.

హోలీ : భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో హోలీ ఒకటి. ఈ పర్వదినాన అందరూ రంగులను చల్లుకుంటూ వేడుకలు జరుపుకునేందుకు ఎక్కువ మంది ఎదురుచూస్తుంటారు. హోలీని వసంత పండుగ అని కూడా అంటారు. ఈ పర్వదినాన మార్చి 18న శుక్రవారం రోజున ఎంతో భక్తితో జరుపుకోనున్నారు.

Read Also : Maha Shivaratri 2022 : శివపూజలో ఈ తప్పులు అసలే చేయొద్దు.. శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి జాగ్రత్త!