Maha Shivaratri 2022 : మహా శివుడు.. అభిషేక ప్రియుడు.. ఆయనకు అభిషేకం అంటే చాలా ప్రీతి.. ఆయన లింగాకారుడు.. శివలింగానికి పూజ చేసే సమయంలో చాలామంది తెలిసో తెలియకో కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినాన చేసే పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శివయ్యకు పూజ చేస్తుంటారు.
శివానుగ్రహం పొందాలంటే అనేక పూజ విధానాల్లో సమర్పిస్తుంటారు. శివపార్వతుల కల్యాణం జరిగిన రోజు.. ఆ రోజుంతా శివాలయాల్లో జాగారం చేస్తుంటారు భక్తులు. ఈ ఏడాదిలో (Maha Shivratri 2022) పండుగ మార్చి 1న మంగళవారం రోజున వచ్చింది. ఈ పర్వదినాన శివయ్యకు ప్రత్యేక పూజలను చేయాలనుకుంటున్నారా? అయితే శివపూజ చేసే సమయంలో ఈ వస్తువులను అసలే సమర్పించవద్దు.
ఇలా చేస్తే.. శివయ్యకు ఆగ్రహం తెప్పిస్తాయి జాగ్రత్త.. శివయ్య అనుగ్రహం కలగడం కంటే మీకు అనేక సమస్యలను తెచ్చిపెడతాయని తెలుసా? అందుకే శివపూజలో ప్రత్యేకించి ఈ వస్తువులను అసలే సమర్పించకూడదట.. అవేంటో ఓసారి చూద్దాం..
పసుపు : శివపూజ (Shiv Puja)లో ఎప్పుడూ పసుపును వినియోగించరు. శివుడికి ప్రత్యేకించి భస్మం ధరిస్తాడు. అందుకే ఆయనకు ఎలాంటి పసుపును పూజలో ఉపయోగించడం నిషిద్ధం.
కుంకుమ : శివ పూజలో పసుపుతో పాటు కుంకుమ కూడా సమర్పించరాదు. శివుడు నుదిటిపై తెల్లటి భస్మం ధరిస్తాడు. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. ఆయనలో కోపానికి కలిగిస్తుంది. అందుకే కుంకుమ కూడా శివపూజలో నిషిద్ధం.
కొబ్బరి నీరు : శివ పూజలో కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. శివపూజ చేసే సమయంలో కొబ్బరినీళ్ళను ఆయనకు సమర్పించకూడదంటారు.
శంఖం : శివపూజలో శంఖాన్ని కూడా ఉపయోగించరాదు. శివయ్య పూజలో శంఖాన్ని ఎప్పుడూ కూడా ఊదకూడదు. శివుడు శంఖచూడుడు అనే రాక్షసుడుని సంహరించాడు. శంఖం అసురుడికి చిహ్నంగా చెబుతారు. శంఖాచూర్ణుడు మహావిష్ణువు భక్తుడు.. నారాయణుని ఆరాధనలో మాత్రమే శంఖాన్ని వినియోగిస్తారు. శివారాధనలో శంఖం నిషిద్ధం.
మొగలి పువ్వు : శివ పూజకు మొగలి పువ్వుని అసలే సమర్పించకూడదు. శివపూజకు మొగలి పువ్వు పనికిరాదు. మొగలి పువ్వుని శివుడి శపించాడాని పురాణంలో చెబుతారు. శివపూజలో వినియోగిస్తే ఆయనకు ఆగ్రహం కలుగుతుందట.. ఎరుపు రంగు పూలను కూడా శివునికి సమర్పించకూడదట.
తులసి దళం : తులసి దళం.. పురాణంలో ఒకనాటి జన్మలో తులసి బృందాగా జన్మించింది. తులసి భర్త పేరు జలంధర్.. జలంధరుడిని శివుడు సంహరించాడు.. తన భర్తను సంహరించినందున శివ పూజకు ఆమె అంగీకరించలేదు. దాంతో శివుడి పూజలో తులసిని కూడా వినియోగించరని పురాణంలో చెబుతారు.
గమనిక : పురాణాల్లో శివపూజకు సంబంధించి నియమాలు.. శివయ్యను ఎలా ఆరాధించాలో అనేక విషయాలను ప్రస్తావించారు. అలాంటి అంశాల్లో కొన్నింటిని సేకరించి మీకు అందిస్తున్నాం.. ఇది కేవలం అవగాహన కోసమేననే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
Read Also : Devotional News : హిందువుల పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే ఎక్కువగా ఎందుకు వాడతారో తెలుసా ?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world