...

Karthika Pournami 2021 : కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీకంతా మంచే జరుగుతుంది.. శుభ ఫలితాలొస్తాయట..

Karthika Pournami 2021 : దేశంలో హిందూ మత విశ్వాసాలను బలంగా నమ్మేవారు చాలా మందే ఉంటారు. వీరంతా హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టం ఉంది. ఈ రోజున ఆ పరమేశ్వరుడు ‘త్రిపురాసురుడు’ అనే రాక్షసుడిని సంహరించాడని ప్రసిద్ధి.

దాంతో పాటే కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో భూమిపై అడుగుపెట్టాడని కొందరు పండితులు చెబుతుంటారు. ఈ రోజున చాలా మంది మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో శివుడిని కొలుస్తారు. దీపాలు వెలిగించి తమ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ తమ కోర్కెలు తీర్చాలని పూజలు చేస్తారు.కార్తీకపౌర్ణమి నాడు ఉపవాసం ఉండటంతో పాటు సాయం కాలం సమీపంలోని ఆలయాలకు వెళ్లి దీపాలను దానం ఇస్తారు.

ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు కొందరు. ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలోనూ దాన ఫలం లభిస్తుందని నమ్ముతుంటారు. ఈరోజున తులసి చెట్టుకు పూజలు చేస్తే దారిద్ర్యం పోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు సెలవిస్తున్నారు.కార్తీక పౌర్ణమి నాడు గంగా నదిలో శుభ్రంగా స్నానమాచరించడం అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందట..

అదేవిధంగా మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపుతో కలిపిన నీటి పోసి స్వస్తిక్ ముద్రవేయాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కడితే లక్ష్మీదేవి వస్తు్ందని పండితులు చెబుతున్నారు.అలాగే గంగానది ఘాట్ వద్ద దీపం వెలిగించడంతో పాటు దీప దానం చేయడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి మట్టితో తిలకం వేస్తే ప్రతీ పనిలో విజయం కలుగుతుంది. ఈ పర్వదినాన శివునికి ప్రత్యేక పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని తెలుస్తోంది.అంతేకాకుండా రావి చెట్టు ఆకులపై దీపం వెలిగించి విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం వలన వివాహంలో దోషం ఉన్నవారికి త్వరగా పెళ్లి జరిగే ఆస్కారం ఉంటుంది.

Read Also : Monal Gajjar : యానీ మాస్టర్‌ బిగ్‌బాస్ లోకి వచ్చింది అందుకేనట.. మోనాల్ షాకింగ్ కామెంట్స్..!