International Women’s Day 2022 : రేపటి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. (International Women’s Day 2022) శుభాకాంక్షలు. సాధారణంగా ప్రతి ఏడాదిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అయితే 2022 ఏడాదిలో కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.
అంటే.. మంగళవారం (international women’s’ day 2022 On March 8) జరుపుకోనున్నారు. ప్రతి ఏడాదిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ థీమ్ ఉంటుంది. 2022 ఏడాదిలో కూడా సరికొత్త థీమ్ తో ముందుకొస్తోంది. అదే.. “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. అంటే.. ‘రేపటి మహిళలు’ అని చెప్పవచ్చు.. వివిధ రంగాలలో మహిళలు, బాలికలు సాధించిన విజయాలు, సహకారాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు (#IWD2022) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
International Women’s Day 2022 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. థీమ్ ఇదే..
ఈ రోజు మహిళా సాధికారత, లింగ సమానత్వంపై అందరిలో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. అయితే ఈ మహిళా దినోత్సవ వేడుకలు ఎప్పుడు మొదలయ్యాయి.. మహిళా దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? తెలుసుకుందాం.. 1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏడాదిలో మార్చి 8న మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. అంటే ఈ వేడుకలకు వందేళ్ల చరిత్ర ఉంది.
📌 SAVE THE DATE 📌
AdvertisementJoin us for the @UN Observance of #InternationalWomensDay 2022, as we recognize the women and girls who are leading the charge on #ClimateAction towards a sustainable future.
Advertisement🌱8 March 2022
🌱10:00 a.m. ESTAdvertisementRSVP: https://t.co/eFFGOBBh9B#IWD2022 #WHM
Advertisement— UN Women (@UN_Women) March 2, 2022
Advertisement
మహిళలు అనాధిగా సమాజంలో ఎన్నో సమస్యలను ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు. 2022 మహిళా దినోత్సవ థీమ్ ఉద్దేశం “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. దీనిగురించే చెబుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందుగానే మహిళల్లో ప్రేరణ కలిగించే కోట్స్ (International Women’s Day: Inspiration Quotes by Women) మొదలయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు, బాలికలను #IWD2022 ప్రత్యేకంగా గౌరవించనుంది.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world