Naga Chaitanya: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బంగార్రాజు చిత్రం ద్వారా ఒక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య తన కెరీర్ పై దృష్టిని ఉంచి వరుస సినిమాలో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రంలో నటిస్తూ మన ముందుకు రాబోతున్నారు అలాగే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాల్లో కూడా నటించారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నాగచైతన్య సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఈ విషయాన్ని నాగచైతన్య తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొద్ది రోజుల వరకు సోషల్ మీడియాలో ఏమాత్రం యాక్టివ్ గా లేని నాగ చైతన్య ప్రస్తుతం ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియా ద్వారా తెలియ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య షోయూ పేరుతో హైదరాబాద్ లో ఒక సరికొత్త రెస్టారెంట్ ని ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
ఇక ఈ విషయాన్ని నాగ చైతన్య తెలియజేయడంతో వెంకటేష్ కూతురు ఆశ్రిత ఈ విషయంపై స్పందిస్తూ నాగచైతన్యకు బెస్ట్ విషెస్ బావ అంటూ రిప్లై ఇచ్చారు.హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడంతో అక్కినేని అభిమానులు సైతం ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వ్యాపారంలో నాగచైతన్య మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక నాగచైతన్య సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World