Malli Serial Aug 18 Today Episode : అరవింద్‌తో చనువుగా మల్లి.. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ మాలినిని రెచ్చగొట్టిన వసుంధర

Malli Serial Aug 18 Today Episode _ Malli feels thankful to Aravind for saving her life. Malini gets upset as Vasundhara provokes her about Malli and Aravind's closeness
Malli Serial Aug 18 Today Episode _ Malli feels thankful to Aravind for saving her life. Malini gets upset as Vasundhara provokes her about Malli and Aravind's closeness

Malli Serial Aug 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా శరత్ చంద్ర కి మల్లి తన సొంత కూతురు అని తెలుస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం.ఇక అనుపమ మరియు మాలిని మల్లి వస్తుందని తనకిష్టమైన స్వీట్స్ చేయాలనుకుంటారు. అప్పుడు అరవింద్ మాలిని దగ్గరికి వచ్చి నాకేం లేదా అంటాడు. అప్పుడు మాలిని మీకోసం కాకరకాయ కూర చేస్తున్నాను అంటుంది. ఇక మాలిని అరవింద్ కలిసి మల్లి కోసం హాస్పిటల్ కి వెళ్తారు. ఇక అక్కడ మల్లి డాక్టర్స్ ని దేవతల భావించి తన ప్రాణాలు కాపాడినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతుంది.

Malli Serial Aug 18 Today Episode _ Malli feels thankful to Aravind for saving her life. Malini gets upset as Vasundhara provokes her about Malli and Aravind's closeness
Malli Serial Aug 18 Today Episode

అప్పుడు అరవింద్ మల్లి దగ్గరికి వెళ్లి నీకేమైనా పిచ్చి పట్టిందా నీ కుట్లు ఇంకా మానలేదు నువ్వు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే ఇక్కడ ఇంకా వారం రోజులు ఉండాల్సి వస్తుంది అంటాడు. సరే నిన్ను ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంటికి వెళ్దాం పద అనగానే మల్లి తన చెప్పులు కోసం బెడ్ కిందకి ఒంగుతుంది. అప్పుడు అరవింద్ ఏంచేస్తున్నావ్ అనగానే నా చెప్పులు కింద ఉన్నాయి బాబుగారు అంటుంది. ఇక అరవింద్ సరే నేను తీస్తాను అంటాడు. అప్పుడు మల్లి మీరు ఎలా తీస్తారు నా చెప్పులు ముట్టుకోకూడదు అంటుంది. అప్పుడు అరవింద్ ఏం పర్లేదు నేను తీస్తాను అని చెప్పి తన చెప్పులు బయటకు తీస్తాడు.

Advertisement

ఇక మాలిని అరవింద్ మల్లి ని తీసుకొని కారులో వస్తుంటారు. ఇక మల్లికి ఎక్కిళ్లు వస్తుంటే మాలిని కొబ్బరిబోండం ఉన్నచోట కార్ ఆపండి అంటుంది. అప్పుడు అరవింద్ కొబ్బరి బోండాలు ఉన్న దగ్గర కారు ఆపుతాడు. ఇక మాలినికి కాల్ వస్తే మాట్లాడుకుంటూ అక్కడ నుండి వెళుతుంది. అరవింద్ మల్లి కి కొబ్బరి బొండం తాగిస్తాడు. ఇక వసుంధర అక్కడే ఉన్న మాలిని ని చూసి కార్ అవుతుంది. ఇక మాలిని తో ఒకసారి అటు చూడు మీ ఆయన ఒక పని మనిషి కి తన చేతితో కొబ్బరి నీళ్ళు తాగిస్తున్నాడు. నీకెప్పుడైనా అలా చేశాడా అయినా నా పిచ్చి కాకపోతే హనీమూన్ కి వెళ్లడానికి నీతో టైం లేదు అన్నవాడు నిన్ను ప్రేమగా ఎలా చూసుకుంటాడులే అంటుంది.

Malli Serial Aug 18 Today Episode _ Malli feels thankful to Aravind for saving her life. Malini gets upset as Vasundhara provokes her about Malli and Aravind's closeness
Malli Serial Aug 18 Today Episode

Malli Serial Aug 18 Today Episode : మల్లి తన కూతురే అని చెప్పిన శరత్ మాటల్ని వసుంధర వినేసిందా..

ఎవరైనా చూస్తే వాళ్ళిద్దర్నీ భార్యాభర్తలు అనుకుంటారు. మగవాడు వేరే అమ్మాయితో చనువుగా ఉన్నాడంటే దాని అర్థం తన భార్య చేతగానితనం నా కూతురు చేతకాని దానిది కాదు అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అరవింద్ మాలిని మల్లి ని తీసుకుని ఇంటికి వస్తారు. సుమిత్ర దిష్టి తీయడానికి వాళ్లని గుమ్మం ముందు అవుతుంది. అప్పుడు మల్లి దిష్టి తీయాల్సింది నాకు కాదు అమ్మగారు మాలిని అక్కకు దొరబాబు గారికి తీయాలి అంటుంది. మీరు నన్ను హాస్పిటల్లో సొంత బిడ్డల్లా చూసుకున్నారు. అయినా నాకు ఎవరు దిష్టి పెడతారు అమ్మగారు అంటుంది.

Advertisement
Malli Serial Aug 18 Today Episode _ Malli feels thankful to Aravind for saving her life. Malini gets upset as Vasundhara provokes her about Malli and Aravind's closeness
Malli Serial Aug 18 Today Episode

బాబు గారు మాలిని అక్క వాళ్ల జంటను చూసి అందరూ దిష్టి పెట్టారు. మాలిని అక్క చూపించే ప్రేమ నా సొంత అక్క కూడా చూపించదేమో అంటుంది. ఇక అరవింద్ బాబు గారు నా ప్రాణాలను కాపాడాడు అంటుంది. ఇక నేను దిష్టి తీస్తాను అని చెప్పి అరవింద్ మరియు మాలినికి దిష్టి తీస్తుంది. అప్పుడు మాలిని నన్ను క్షమించు మల్లి ఈరోజు మా అమ్మ అన్న మాటలు నన్ను నెగిటివ్గా ఆలోచించేలా చేశాయి. కానీ నీ మనసు ఏంటో నాకు ఇప్పుడే అర్థం అయింది. అరవింద్ తో నిన్ను అలా చూడగానే నాకు చాలా కోపం వచ్చింది అని తన మనసులో అనుకుంటుంది. ఇక మల్లి బందర్ ని పిలిచి ఆ నీళ్లను చెట్టు మొదట్లో పోయమని చెప్తుంది.

Malli Serial Aug 18 Today Episode _ Malli feels thankful to Aravind for saving her life. Malini gets upset as Vasundhara provokes her about Malli and Aravind's closeness
Malli Serial Aug 18 Today Episode

ఇక అనుపమ అక్కడే ఉంటావా ఇంట్లో కొచ్చేది ఏమైనా ఉందా అంటుంది. ఇక అందరూ కలిసి ఇంట్లోకి వస్తారు. అప్పుడు అరవింద్ మల్లి నువ్వు నీ రూమ్ లో పడుకోమాకు పైన ఖాళీగా ఉన్న బెడ్రూంలో పడుకో కింద పడుకుంటే నీ చెయ్యి నొప్పి లేస్తుంది అంటాడు. ఇక సుమిత్ర కూడా ఓకే కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అప్పుడు సుమిత్ర వాళ్ళ ఆయన జాగ్రత్తగా ఉండాలని నువ్వు మల్లికి చెప్తున్నావ ఇల్లు అంతా తనదే కదా అంటాడు. ఇక ఆ మాట కి మల్లి ఎమోషనల్ అవుతుంది. ఇక రేపు ఏం జరగబోతుందో చూడాలి.

Advertisement

Read Also : Malli Nindu Jabili Serial Aug 17 Today Episode : మీరాతో రిలేషన్‌పై శరత్ చంద్రను నిలదీసిన వసుంధర.. మల్లితో పెళ్లిపై ఆందోళనలో అరవింద్!

Advertisement