Malli Nindu Jabili Serial Aug 26 Today Episode : బుల్లితెర లో ప్రసారం అవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద ఆఫీస్ వాళ్లు ఇంటికి వచ్చి అరవింద మీ ఆయన అని మల్లి అడుగుతారు అవును అని చెప్తుంది. మాలిని పై కోపంగా మాటలుడుతుంది. . అరవింద మౌనంగా ఉంటాడు. అరవింద దగ్గరికొచ్చి మల్లి అందరికీ అనుమానం వస్తుంది కదా మీరు ఎందుకు అలా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. నేను ఏ తప్పు చేసినా మీరు నన్ను తిట్టండి. ఇంట్లో వాళ్లకి మన పెళ్లి విషయం తెలియకూడదు. మాలిని అక్కకు డౌట్ రాకుండా చూసుకోండి. సరేనా అని మల్లి అంటుంది సరే అని అరవిందు అంటాడు.

Malli Serial Aug 26 Today Episode _ Sharath gets furious as Vasundhara tries to provoke him. Later, Malini is worried about Sharath’s whereabouts
శరత్ చంద్ర వాళ్ల అమ్మతో మాలిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు వాళ్ళమ్మ పూజగదిలో కుంకుమబొట్టు ఇస్తుంది. మల్లిని రోజు పెట్టుకోమని చెప్తుంది. మాలిని , మల్లి ఇంటికి తీసుకొని రా అని అంటుంది. సరే ఇద్దరు కూతుర్లు తీసుకుని వస్తాను అని అంటాడు. అక్కడికి వసుంధర వాళ్ళ మాటలు విని మీకు ఎంతమంది కూతుర్లు ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. శరచ్చంద్ర మౌనంగా ఉంటాడు. మా ఆయన మొహమాటం పడుతున్నారా అత్తయ్య గారు మీరైనా చెప్పండి. అదేం పిచ్చి ప్రశ్న వసుంధర మనకి కొడుకైనా కూతురైనా మాలిని ఒక్కతే కదా,.. అవును నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ మీ అమ్మగారితో నా కూతురున్నా వెంట పెట్టి తీసుకొని వస్తాను అంటున్నారు కదా.
అవునా నేను అలా అన్నానా ఏదో పొరపాటు అలా అన్నానేమో. పొరపాటు అయితే ఏమి చేయలేదు కదా.. నాకు ఒక విషయం చెప్తారా మీరు మన అమ్మాయి మాలిని చూడండి చూస్తున్నారా లేదా ఆ పని దానికి ఎలా ఉందో తెలుసుకోవడానికి వస్తున్నారా. మళ్లీ ఒక ఆడపిల్ల తన వాళ్ళ అమ్మ పెట్టిన పేరు ఉంది కదా. అవసరమైన చెత్త నేను నీలా గుర్తుపెట్టు కోను. నిన్ను మంచిగా ఉండడం చెప్పడం నాది బుద్ధి తక్కువ. అవును నేను ఆ అమ్మాయిని అంటే నీకు ఎందుకు అంత కోపం అని అంటుంది ఆవేశంతో శరత్ చంద్ర మళ్లీ నా కూతురు అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ రా అంటుంది. మల్లి, మాలిని సొంత అక్క చెల్లెలు ఎలా ఉంటారు. అందుకే నా కూతురు అన్నాను అమ్మ అంటాడు. అప్పుడు కోపంతో వసుంధర మాలిని అందం నీ దగ్గరికి తీసుకుంది అలా అని మీరు అనకండి అంటుంది.

Malli Serial Aug 26 Today Episode _ Sharath gets furious as Vasundhara tries to provoke him. Later, Malini is worried about Sharath’s whereabouts
అరవింద్ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. మాలిని అందరికీ సీట్లు ఇస్తూ ఉండగా మాలిని అమ్మ నాన్న వస్తారు ఇప్పుడు అందరూ పలకరిస్తారు. వసుధార అక్కడికొచ్చి మీ పద్ధతులు ఏమిటో నాకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటుంది. అప్పుడు అనుపమ మీరు దేని గురించి అంటున్నారు అని అరవింద్ తల్లి అంటుంది. అప్పుడు మాలిని వాళ్ళ అమ్మ నా కూతుర్ని పనిమనిషి చేశారు కదా అందుకే అలా అంటున్నాను. మాలిని కాఫీ తీసుకొచ్చాను అమ్మ నువ్వు ఎందుకు చేస్తున్న పని పని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇంటి మనిషి అని మల్లి ఉంది కదా. అమ్మ మన ఇంట్లో నాన్న తలనొప్పి వచ్చినప్పుడు నేనే పెట్టాను కదా కాఫీ మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా అయినా అప్పుడు అడగలేదు కదా ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు. అప్పుడు మాలిని వాళ్ళ నాన్న ఈ ప్రశ్నకు మీ అమ్మ సమాధానం చెప్పలేదు. మాలిని నీతో మాట్లాడాలని వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్తుంది. పట్టించుకోకండి ఆడవాళ్ళు ఉండే సహనం ఓపిక మావిళ్ళ లేదు అని చంద్ర అంటాడు. ఇల్లంతా సైలెంట్ గా ఉంది. అల్లరి పిల్ల మల్లి ఎక్కడ చూసి చాలా రోజులు అవుతుంది. అరవింద పైన ఉంది మావయ్య అంటాడు.
Malli Nindu Jabili Serial Aug 26 Today Episode : మల్లి కన్నబిడ్డని తెలిసినా ఏం చేయలేని శరత్ చంద్ర..
మల్లి గురించి మీరు చెప్పిన ప్రతి సారి నాకు ఏదో అనుమానం గా ఉంటుంది. నీ మాటల వలన మళ్ళీ అలా చేసి నాకు అర్థం కావట్లేదు కానీ మిమ్మల్ని మల్లి ని అవమానించిన ప్రతి సారీ నా అనుమానం తప్పు అని ప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే త్వరలోనే మల్లి అసలు రూపం నీకు తెలుస్తుంది. అప్పుడు శరత్ చంద్ర మల్లి చూసి నాకు తనే గుర్తు వస్తుంది అదే భాష అదే యాటిట్యూడ్ నువ్వు నా కూతురు ని తెలియనప్పుడే నా మనసాక్షి నాకు చెప్తూ ఉండేది తల్లి మీరా కూతురు ఏమో అని. అందుకే ఎన్నోసార్లు మీ అమ్మ గురించి అడిగాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నిన్ను చూస్తుంటే నా మీరా చూసినట్టే ఉంది. నమస్తే మేడం అయ్యగారు మల్లి తో ఎందుకు పని చేస్తున్నావ్ అని అంటాడు. ఇది ఒక పని నా పని అయ్యగారు.. ఆడపిల్ల కంటతడి పెట్టుకుంటే తండ్రి చూడలే vadu కానీ నీ తండ్రి లేడు అని మల్లి అంటుంది. శరత్ చంద్ర నువ్వు పని చేస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అలా అనకు నేను ఉన్నాను అమ్మ నీకు. అదే అమ్మ మాలిని నీకు అక్క అలాంటి కదా అందుకే నేను నీకు తండ్రి లాంటి వాడిని నువ్వు నాకు కూతురు లాంటి దానివి కదా అమ్మ మీది చాలా గొప్ప మనసు అయ్యగారు ఎవడో ముక్కు మొహం తెలియని నన్ను నీ కూతురు అనుకున్నారు.
మీలాంటి గొప్ప తండ్రి దొరకడం మాలిని అక్క యొక్క అదృష్టం.. మా నాన్న గారు ఉన్నారు ఎందుకు మా అమ్మని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కాలాన్ని కూడా నన్ను కానీ మా అమ్మని కానీ చూడడానికి రాలేదు. నా పిచ్చి కాకపోతే నేను ఒక దాన్ని పుట్టానని కూడా మా నాన్నకు తెలుసో లేదో ఈ జన్మలో నేను మా నాన్నను చూస్తాం అని నమ్మకం రోజు రోజు చచ్చిపోతుంది అయ్యగారు. అలా అనకు మల్లి త్వరలోనే మీ నాన్నని చూస్తావు నీకు మీ అమ్మకి దూరంగా ఉన్నందుకు క్షమించమని అడుగుతాడు. ధైర్యం కోసం చెబుతున్నారా అయ్యగారు అది ఏమీ లేదమ్మా జరిగే చెప్తున్నాను ఇది శివయ్య విభూతి అమ్మవారి కుంకుమ రోజు నిన్ను పెట్టుకోమని మా అమ్మ ఇచ్చిన అమ్మ నీకు అంతా మంచి జరుగుతుంది. అప్పుడు మల్లి థాంక్యూ అయ్యగారు . థాంక్యూ పరాయి వాళ్లకు చెపుతారు రక్త సంబంధం ఉన్న వాళ్ళం కాదు. అది నేను పంచిన రక్తాన్ని మీ అక్క మాలిని నీకు ఇచ్చింది. శరత్ చంద్ర తన మనసులో నేనే నీ పని అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటాడు. కోపంతో వసుంధర, మాలినితో మీ నాన్నను మల్లి తో మాట్లాడొద్దని. అయినా కానీ తన సొంత కూతురిలా మాట్లాడుతూడు .

Malli Serial Aug 26 Today Episode _ Sharath gets furious as Vasundhara tries to provoke him. Later, Malini is worried about Sharath’s whereabouts
తొందరగా మల్లి నుంచి ఇంటికి బయటకు పంపించు. అక్కడ లంచ్ బాక్స్ లో చూసి నాతో అబద్ధం చెప్పాడు అనాధ పిల్లలకు ఇస్తానని మల్లి కి పోయాడా. ఆ లంచ్ బాక్స్ కోపం అరవింద్ కుటుంబ సభ్యుల ముందు వసుంధర విసిరేస్తుంది. ఈ బాక్స్ లెక్కలు ఎలా వచ్చాయి. సమాధానం చెప్పండి ఏదో ఒకటి చెప్తారు కదా.. వసు ఇక్కడ గొడవ పడడం కరెక్ట్ కాదు అని అంటాడు. దాని కలవడం కోసం నా దగ్గర అబద్ధం చెప్తారా. నాకు తెలియకుండా కలవాల్సిన అవసరం ఏముంది అని నిలదీస్తుంది శరత్ చంద్ర.. పని మనిషి కి నీకు ఏమిటి సంబంధం.. మల్లి పని మనిషి కాదు ఇంకోసారి అలా అనవద్దు. మీ మాటలు వింటుంటే మీ కోపాన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ పనిమనిషి మీకు సంబంధం ఏమవుతుంది.
మనిషి మీద అంత అభిమానం ఉంటే దత్తత తీసుకోండి మీ ఇంటి పేరు తనకు పెట్టుకోండి నీ కూతురు గా ఇంటికి తీసుకు రండి నా నెత్తి మీద కూర్చోబెట్టాలని కోపంతో ఆవేశంతో వసుంధర మాట్లాడుతుంది. శరత్ చంద్ర కోపంగా గట్టిగా వసుంధర అని చెయ్యి లేపుతాడు. అప్పుడు మాలిని వైపు చూస్తూ చెయ్యి దించుతాడు. మాలిని ఏడుస్తూ ఇంట్లో గొడవ జరగడానికి కారణం నువ్వే మల్లి అంటూ మా అమ్మ ఎప్పుడు చెప్తుంది ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. మా నాన్నగారికి ఏదైనా జరగరానిది జరిగితే నేను సహించలేను మల్లి అని బాధపడుతుంది. నా భాద నీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నీకు మీ నాన్న ప్రేమ తెలియదు కదా. మాలిని బయటకు వెళ్తానంటూ వెళ్తుండగా అరవింద్ వద్దని చెబుతాడు. అయినా మాలిని అరవింద్ మాట వినకుండా తండ్రి కోసం బయటకు వెళ్తుంది. మాలిని మాటలకు మల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఇంట్లో వాళ్లంతా కంగారుపడతుంటారు. మల్లిని వెతికేందుకు అరవింద్ వెళ్తానంటే మాలిని కోపడతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Read Also : Guppedantha Manasu: రిషికి ప్రామిస్ చేసిన వసుధార..రిషి కౌగిట్లో వసు…?